దిల్ రాజు ఇంటి హీరో ..అంతా రెడీ

Sunday,July 22,2018 - 03:00 by Z_CLU

‘లవర్’ సినిమాతో అన్నయ్య కొడుకు హర్షిత్ రెడ్డిను నిర్మాతగా పరిచయం చేసిన దిల్ రాజు త్వరలోనే తమ్ముడు శిరీష్ కొడుకు ఆశిష్ రెడ్డిను  హీరోగా పరిచయం చేయబోతున్నాడు. ఇటివలే ఓ సినిమా ప్రమోషన్ లో తమ ఫ్యామిలీ నుండి ఆశిష్ రెడ్డిను హీరోగా పరిచయం చేయబోతున్న సంగతి తెలియజేసిన దిల్ రాజు ఈ సినిమాకు ‘పలుకే బంగారమాయె’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలిపాడు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకూ ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుందని తెలుస్తుంది.

ఇప్పటికే ఆశిష్ కోసం కథ ఒకే చేసిన దిల్ రాజు ఈ సినిమాతో సతీష్ అనే దర్శకుడిని పరిచయం చేయబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం ఆశిష్  యాక్టింగ్ తో పాటు డాన్స్, ఫైట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడట. అక్టోబర్ నుండి ఈ సినిమా సెట్స్ వెళ్ళే చాన్స్ ఉంది.