రాజశేఖర్ కూడా అదే రూట్ లో ?

Sunday,July 22,2018 - 04:30 by Z_CLU

ఇటివలే 1980 బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘రంగస్థలం’ ఎంతటి విజయం సాదించిందో తెలిసిందే…ఇప్పుడు హీరో రాజశేఖర్ కూడా అదే బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. కాకపోతే మరో అడుగు వెనక్కి వేసి ప్రేక్షకులను 70 లోకి తీసుకెల్లబోతున్నాడట ఈ సీనియర్ హీరో.

ఇటివలే ‘గరుడవేగ’ సినిమాతో ఐయాం బ్యాక్ అనిపించుకున్న రాజశేఖర్ త్వరలోనే అ! సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా 1970 బ్యాక్ డ్రాప్ లో పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కనుందని, రాజశేఖర్ మరోసారి పవర్ ఫుల్ పోలిస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది.

ప్రస్తుతం తమన్నా నటిస్తున్న క్వీన్ తెలుగు రిమేక్ను హ్యాండిల్ చేస్తున్న ప్రశాంత్ వర్మ మరో నెల పాటు ఆ సినిమాకి వర్క్ చేయనున్నాడు. ఆ సినిమా ఫినిష్ అవ్వగానే రాజశేఖర్ సినిమాకు సంబంధించి పనులు మొదలుపెడతాడని సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.