దిల్ రాజు నుండి డబుల్ బొనాంజా..!

Tuesday,May 01,2018 - 11:03 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో సక్సెస్ మోడ్ లో ఉన్నాడు దిల్ రాజు… ప్రస్తుతం ‘లవర్’,’శ్రీనివాస కళ్యాణం’,’హలో గురు ప్రేమ కోసమే’ సినిమాలను నిర్మిస్తూ ఫుల్ బిజీ గా ఉన్న దిల్ రాజు మరో వైపు బ్యాక్ టు బ్యాక్ మల్టీ స్టారర్స్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయబోయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే వెంకటేష్ – వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాను అనౌన్స్ చేసిన దిల్ రాజు మరికొన్ని రోజుల్లో నితిన్ -శర్వానంద్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మల్టీ స్టారర్ సినిమాను కూడా అనౌన్స్ చేయబోతున్నాడు.

ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. వెంకీ -వరుణ్ తేజ్ సినిమాను అనీల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా నితిన్ -శర్వా సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. ఈ రెండు సినిమాలతో మళ్ళీ మల్టీ స్టారర్ సీజన్ ను బిగిన్ చేయబోతున్నాడు దిల్ రాజు.