రంగంలోకి దిగుతున్న బాలయ్య

Tuesday,May 01,2018 - 01:00 by Z_CLU

నందమూరి నటసింహం బాలయ్య తన తండ్రి నందమూరి తారక రామారావు కథతో ‘NTR’ అనే ప్రతిష్టాత్మక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.. కారణాలు తెలియవు కానీ ఈ సినిమా నుండి హటాత్తుగా తప్పుకున్నాడు తేజ. దర్శకుడు తేజ బయటికి రావడంతో ఇప్పుడీ సినిమా కోసం దర్శకుడిగా రంగంలోకి దిగబోతున్నాట బాలయ్య. నిన్నటి వరకూ ఈ సినిమాను రాఘవేంద్ర రావు , క్రిష్ డైరెక్ట్ చేసే చాన్స్ ఉందనే టాక్ వినిపించగా ఇప్పుడు బాలయ్యే స్వయంగా రంగంలోకి దిగుతున్నాడని తెలుస్తుంది.

స్క్రిప్ట్ రెడీ గా ఉండటంతో కొందరు సన్నిహితులు ఇచ్చిన సలహా మేరకూ ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించడానికి సిద్దమవుతున్నాడట బాలయ్య.

అయితే రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యావేక్షణలో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. త్వరలోనే యూనిట్ నుండి  బాలయ్య డైరెక్షన్ గురించి అఫీషియల్ గా  అనౌన్స్ మెంట్ రానుందట.