'సవ్యసాచి' ఫైనల్ షెడ్యూల్ డీటెయిల్స్

Tuesday,May 01,2018 - 10:02 by Z_CLU

అక్కినేని నాగ చైతన్య -చందూ మొండేటి కాంబినేషన్ లో థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా  తెరకెక్కుతున్న  ‘సవ్య సాచి’ ఫినిషింగ్ స్టేజికి చేరుకుంది. ఈ సినిమాకు సంబందించి ఫైనల్ షెడ్యూల్  మే 4 నుండి అమెరికాలో జరగనుంది. ఈ షెడ్యూల్ లో ఓ సాంగ్ తో పాటు కొన్ని సీన్స్ కూడా షూట్ చేయబోతున్నారు . ఈ షెడ్యూల్ తో టోటల్ షూటింగ్ కి ప్యాక్ అప్ చెప్పనుంది యూనిట్.

నాగ చైతన్య సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా  నటిస్తుండగా మాధవన్, భూమిక కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. జూన్ 14 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.