బాలయ్య సినిమా నుంచి తప్పుకున్న దేవిశ్రీ

Wednesday,August 10,2016 - 12:14 by Z_CLU

బాలయ్య నటిస్తున్న ప్రతిష్టాత్మక వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి నుంచి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ తప్పుకున్నాడు. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఇది పక్కా. ఎందుకంటే… వరుస సినిమాలతో బిజీగా ఉన్న దేవిశ్రీప్రసాద్… శాతకర్ణి సినిమాకు సంగీతం అందించడానికి టైం కేటాయించలేకపోతున్నాడు. ఆమధ్య అమెరికాలో ఈ సినిమాకు సంబంధించి కొన్ని ట్యూన్స్ కంపోజ్ చేసినప్పటికీ… పూర్తిస్థాయిలో ప్రాజెక్టుపై సమయం కేటాయించలేకపోతున్నాడు. దీంతో బాలయ్యతో చర్చించి మరీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం దర్శకుడు క్రిష్, మరో సంగీత దర్శకుడి కోసం వెదుకున్నట్టు తెలుస్తోంది. ఇళయరాజా లేదా కీరవాణిలో ఒకర్ని తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. మరోవైపు కంచె సినిమాతో ఆకట్టుకున్న చిరంతన్ భట్ ను కూడా తీసుకునే ఆలోచనలో క్రిష్ ఉన్నట్టు తెలుస్తోంది. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఎవరు సంగీత దర్శకత్వం వహించబోతున్నారనే విషయం త్వరలోనే తెలుస్తుంది.