తనయులతో రెండు సినిమాలు...

Wednesday,August 10,2016 - 11:43 by Z_CLU

హీరో నుంచి పవర్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన మోహన్ బాబు… సెకెండ్ ఇన్నింగ్స్ లో కూడా దూసుకుపోతున్నారు. వరుసగా సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నారు. తాజాగా కలెక్షన్ కింగ్ మరో రెండు సినిమాలు ప్రకటించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఈ సీనియర్ నటుడు… తన ఇద్దరు కొడుకులతో చెరో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. మంచు విష్ణు హీరోగా సేనాపతి పేరుతో ఓ సినిమా చేయబోతున్నానని, వచ్చే ఏడాది ఆ సినిమా ప్రారంభమౌతుందని తెలిపారు. మరోవైపు మంచు మనోజ్ హీరోగా నటించనున్న మరో కొత్త సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు మోహన్ బాబు ప్రకటించారు. గతంలో మంచు మనోజ్, మంచు విష్ణు, మోహన్ బాబు కాంబినేషన్ లో పాండవులు పాండవులు తుమ్మెద అనే సినిమా సినిమా వచ్చింది. విష్ణు, మనోజ్ లతో తను చేయబోతున్న సినిమాలు… సొంత సంస్థ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పైనే ఉంటాయని మోహన్ బాబు క్లారిటీ ఇచ్చారు.