ప్రారంభమైన 'ఏంజెల్' చిత్రం

Wednesday,August 10,2016 - 03:12 by Z_CLU

 

సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై భువన్ నిర్మాణం లో నాగ అన్వేష్, హేబా పటేల్ హీరో హీరోయిన్స్ గా పళని దర్శకత్వం లో తెరకెక్కనున్న ‘ఏంజెల్’ చిత్రం ఈరోజే ఘనంగా ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి యువ కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ క్లాప్ కొట్టారు. అనంతరం సాయి ధరమ్ తేజ్ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సింధురపువ్వు కృష్ణ రెడ్డి మాట్లాడుతూ ” మా పెద్దబ్బాయి భువన్ నిర్మాతగా మా చిన్నబ్బాయి నాగ అన్వేష్ హీరో గా రూపొందుతున్న ఈ ఏంజెల్ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యింది. అన్నిటిలో క్లారిటీ వచ్చాకే ప్రారభించాలనుకున్నాం. అందుకే ఈ రోజు ప్రారంభిస్తున్నాం. కథ, కధాంశం ప్రేక్షలుకులను ఆకట్టుకుంటాయని ఆసితున్నా” అన్నారు.
నిర్మాత భువన్ మాట్లాడుతూ ” మా తమ్ముడు కి చిన్న తనం నుండే సినిమాల మీద అమితమైన ఆసక్తి ఉండేది. అందుకే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి కొంత గ్యాప్ తీసుకొని రీసెంట్ గా ‘వినవయ్యా రామయ్యా’ అనే సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యాడు. అది అనుకున్నంత రేంజ్ కి వెళ్ళలేదు. కానీ ఈ ‘ఏంజెల్’ సినిమా ఆ రేంజ్ కు వెళ్తుందని నమ్ముతున్నాను.” అన్నారు.
దర్శకుడు పళని మాట్లాడుతూ “రాజ మౌళి గారి దగ్గర బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా పని చెయ్యడం జరిగింది. మా గురువు గారి ఆశీస్సులతో ఈ సినిమాను మొదలుపెడుతున్నాను. కథ, స్క్రీన్ ప్లే, సంగీతం అన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయని భావిస్తున్నాం” అన్నారు.
మొదటి చిత్రం లానే ఈ సినిమాను కూడా అందరి ఆశీస్సులు ఉండాలని ఈ సినిమాతో కథానాయకుడిగా రుజువు చేసుకుంటానని నాగ అన్వేష్ అన్నారు.
ఒక మంచి కథ తో కూడిన సినిమాలు టైటిల్ రోల్ చేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందని నాయికా హేబా తెలిపారు.
ఈ సినిమాలో నేను కూడా ఒక భాగం అవ్వడం సంతోషంగా ఉందని చిత్ర సమర్పకులు వెంకయ్య చౌదరి అన్నారు.
సినిమాకు తన వంతుగా అదిరిపోయే మంచి పాటలు ఇవ్వనున్నట్లు సంగీత దర్శకుడు భీమ్స్ తెలిపారు.