చిరు టైటిల్ తో చరణ్ సినిమా ?

Wednesday,September 14,2016 - 09:00 by Z_CLU

గతం లో ప్రముఖ నిర్మాత అశ్వని దత్ మెగా స్టార్ చిరు తో నిర్మించి ఘన విజయం సాధించిన చిత్రం ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’. మళ్ళీ ఇన్నేళ్ల తరువాత ఆ టైటిల్ తో ఓ సినిమా ను నిర్మించడానికి సిద్దమవుతున్నాడు నిర్మాత అశ్వని దత్. కాకపోతే ఈ సారి ఈ టైటిల్ తో నిర్మించేది చిరు తనయుడు రామ్ చరణ్ తో అట. ఇప్పటికే ఈ సినిమా కోసం ‘జగదేక వీరుడు’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు అశ్వనీదత్. కానీ ఈ సారి ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో కాకుండా ‘స్వప్న సినిమా’ బ్యానర్ పై నిర్మించనున్నాడట.

ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వం లో ‘ధృవ’ సినిమాలో నటిస్తున్న చరణ్ త్వరలోనే సుకుమార్ దర్శకత్వం లో ఓ సినిమా చేయనున్నాడు. మరి ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే చరణ్ ‘జగదేక వీరుడు’ సినిమా చేస్తాడా? చేస్తే ఈ సినిమాకు దర్శకుడెవరు? ఇక చరణ్ సరసన అతిలోక సుందరి గా కనిపించే కథానాయిక ఎవరు?
అప్పట్లో శ్రీదేవి కు అతిలోక సుందరి అనే బిరుదు తెచ్చిపెట్టిన ఈ టైటిల్ మళ్ళీ అదే బిరుదు ను ఇప్పటి కథానాయిక కి తెచ్చి పెడుతుందా? చూడాలి.