ఖైదీ నంబర్-150తో పాటు పవనిజం పార్ట్-2

Wednesday,September 14,2016 - 12:25 by Z_CLU

పవన్ ఫ్యాన్స్ అంతా పవన్ ఐడియాలజీని పవనిజం అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇప్పటికే పవర్ స్టార్… ఇజమ్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. జనసేన పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు, ఆలోచనలు అన్నింటినీ అందులో పంచుకున్నారు. ఇప్పుడు కొత్తగా మరో పుస్తకాన్ని రాయడానికి పవన్ రెడీ అవుతున్నారు. ఈ పుస్తకానికి నేను-మనం-జనం అనే పేరు కూడా ఫిక్స్ చేశారు పవన్. దీనికి క్యాప్షన్ గా మార్పు కోసం యుద్ధం అనే పేరు కూడా పెట్టారు. ఈ పుస్తకంలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ను టచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు పవన్. అసలు తను జనసేన పార్టీ పెట్టడానికి కారణాలేంటి…? పార్టీ పెట్టడానికి దారితీసిన పరిస్థితులను ఈ కొత్త పుస్తకంలో వివరించబోతున్నాడు పవన్. ఈ ఏడాది చివరి నాటికి రచన పూర్తిచేసి, వచ్చే ఏడాదికి పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని పవన్ భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం… జనవరిలోనే ఈ పుస్తకం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.