క్రేజీ మల్టీ స్టారర్స్

Friday,March 30,2018 - 11:02 by Z_CLU

స్టార్ హీరో సిల్వర్ స్క్రీన్ పై కళ్ల ముందు కనిపిస్తుంటే ఫ్యాన్స్ కు పూనకాలే. అలాంటిది సింగిల్ స్క్రీన్ పై ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలు కనిపిస్తే. ఆడియన్స్ కు అది కచ్చితంగా పండగే. అలాంటి డబుల్ ఇంపాక్ట్ ను అందించబోతున్నాయి కొన్ని క్రేజీ మల్టీస్టారర్లు.

రామ్ చరణ్ – ఎన్టీఆర్

టాలీవుడ్ లో మోస్ట్ ఎవైటింగ్ మల్టీ స్టారర్ సినిమా తారక్ -రామ్ చరణ్ లదే. బాహుబలి తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా.. అని ఎదురుచూస్తున్న టైంలో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రాజమౌళి ఎనౌన్స్ చేసిన ప్రాజెక్టు ఇది. ఈ దశాబ్దంలోనే కాదు, టాలీవుడ్ చరిత్రలోనే మెస్మరైజింగ్ మల్టీస్టారర్ ప్రాజెక్టు ఇది.


నాగార్జున – నాని

ఒకరు టాలీవుడ్ మన్మధుడు, మరొకరు నేచురల్ స్టార్. ఇలాంటి ఇద్దరు స్టార్స్ కలిస్తే బోలెడంత ఫన్. అలాంటి సిసలైన వినోదాన్నే అందించబోతున్నారు ఈ ఇద్దరు హీరోలు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే అలరించనుంది.

వెంకటేష్ – వరుణ్ తేజ్

కచ్చితంగా డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే మల్టీస్టారర్ ఇది. వెంకీ ఉంటే వినోదం ఉన్నట్టే. ఇక వరుణ్ తేజ్ సంగతి సరేసరి. ఇలాంటి ఇద్దరు స్టార్ హీరోలకు అనిల్ రావిపూడి తోడయ్యాడు. ముగ్గురూ కలిసి ఎఫ్2 అనే క్రేజీ ప్రాజెక్టు చేయబోతున్నారు.

నితిన్ – శర్వానంద్

‘దాగుడుమూతలు’ అనే టైటిల్ తో హరీష్ శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు ఓ సినిమా నిర్మించబోతున్నాడు. కెరీర్ లో ఫస్ట్ టైం శర్వాతో కలిసి ఈ మల్టీ స్టారర్ సినిమాలో  కనిపించబోతున్నాడు నితిన్.  ఎవరూ ఊహించని విధంగా ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ చేశారు దిల్ రాజు-హరీష్ శంకర్. ప్రస్తుతం చెరో సినిమాతో బిజీగా ఉన్న నితిన్, శర్వా  త్వరలోనే ఈ సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు.

వెంకటేష్ – నాగచైతన్య

చాన్నాళ్లుగా ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్న కాంబినేషన్ ఇది. ఈ రియల్ లైఫ్ మామాఅల్లుళ్లు ఇప్పటికే ప్రేమమ్ సినిమాలో మెరిశారు. కానీ ఫుల్ లెంగ్త్ లో ఇద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ చేయాలనేది అభిమానుల కోరిక. త్వరలోనే ఆ కోరిక తీరబోతోంది. బాబి దర్శకత్వంలో వీళ్లిద్దరూ కలిసి త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్నారు.