చిత్రలహరి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,April 15,2019 - 12:24 by Z_CLU

ఎట్టకేలకు హిట్ కొట్టాడు సాయి తేజ్. అతడు నటించిన చిత్రలహరి సినిమా డీసెంట్ కలెక్షన్లతో థియేటర్లలో రన్ అవుతోంది. నిన్నటితో ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి, విడుదలైన ఈ 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అటు వరల్డ్ వైడ్ చూసుకుంటే 12 కోట్ల 80లక్షలకు పైగా నెట్ వచ్చింది.

పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రలహరి సినిమా మరో 2 రోజులు ఇదే స్పీడ్ చూపిస్తే, బ్రేక్-ఈవెన్ అయిపోతుంది. ఇక అక్కడ్నుంచి మూవీ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటరైనట్టే. ప్రస్తుతానికైతే ఈ సినిమాకు ఉన్న సమయం కేవలం ఈ 4 రోజులు మాత్రమే. ఆ తర్వాత థియేటర్లలోకి జెర్సీ వస్తోంది. 4 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్-ఈవెన్ అవ్వడంతో పాటు లాభాల్లోకి కూడా వస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.

ఏపీ, నైజాం ఫస్ట్ వీకెండ్ షేర్
నైజాం – రూ. 2.53 కోట్లు
సీడెడ్ – రూ. 1.28 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.10 కోట్లు
ఈస్ట్ – రూ. 0.78 కోట్లు
వెస్ట్ – రూ. 0.50 కోట్లు
గుంటూరు – రూ. 0.67 కోట్లు
కృష్ణా – రూ. 0.60 కోట్లు
నెల్లూరు – రూ. 0.29 కోట్లు