ABCD ట్రయిలర్.. ఇండియాలో అమెరికన్ కష్టాలు

Monday,April 15,2019 - 11:04 by Z_CLU

అల్లు శిరీష్ హీరోగా నటించిన ABCD ట్రయిలర్ రిలీజైంది. అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ అనేది దీని అర్థం. మలయాళంలో హిట్ అయిన సినిమాకు అదే పేరుతో వస్తున్న రీమేక్ ఇది.

అమెరికాలో పుట్టి విలాసవంతమైన జీవితం గడిపే హీరో ఇండియాకొచ్చి మురికివాడల్లో ఎలాంటి కష్టాలు పడ్డాడనే విషయాన్ని ఫన్నీగా చూపించే ప్రయత్నం చేశారు ఈ సినిమాలో. అల్లు శిరీష్ కు చెందిన ఈ రెండు షేడ్స్ ను ట్రయిలర్ లో చూపించారు. అల్లు శిరీష్ ఫ్రెండ్ గా భరత్ కొత్తగా కనిపించాడు. మొన్నటివరకు బాలనటుడి పాత్రలు వేసిన భరత్, ఇప్పుడు గడ్డంతో కనిపించాడు.

శిరీష్ సరసన హీరోయిన్ గా నటించిన రుక్సార్ థిల్లాన్ ట్రయిలర్ లో ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. మధుర శ్రీధర్, యష్ రంగినేని నిర్మాతలుగా తెరకెక్కించిన ఈ సినిమాకు సురేష్ బాబు ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. సంజీవ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సమ్మర్ ఎట్రాక్షన్ గా మే 17న థియేటర్లలోకి రానుంది ABCD.