ఒక్క పాటకు కోటి రూపాయల ఖర్చు

Monday,April 15,2019 - 01:32 by Z_CLU

కాంచన-3లో కేవలం ఒకే ఒక్క పాట కోసం ఇలా కోటి 30 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. లారెన్స్ హీరోగా, స్వీయదర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో ఈ సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండబోతోంది.

ఈ పాట కోసం ప్రత్యేకంగా సెట్ వేశారు. అంతేకాదు ఏకంగా 1400 వందల మంది డాన్సర్లు పాల్గొన్నారు. వీళ్లలో 4వందల మందికి అఘోరా గెటప్స్ వేశారు. మిగతా వెయ్యి మందికి విభిన్నమైన గెటప్స్ వేశారు. ఏకంగా 6 రోజుల పాటు ఈ సాంగ్ షూట్ చేశారు. అందుకే అక్షరాలా కోటి 30 లక్షల రూపాయలు ఖర్చయింది.

లారెన్స్, ఒవియా, వేదిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కోవై సరళ, శ్రీమాన్, సత్యరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. రాఘ‌వేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో రాఘ‌వ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో బి.మధు రిలీజ్ చేస్తున్నారు. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది కాంచన-3.