చిత్రలహరి ఫస్ట్ డే కలెక్షన్

Saturday,April 13,2019 - 10:45 by Z_CLU

ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు హీరో సాయి తేజ్. వరుస ఫ్లాపుల తర్వాత హిట్ కోసం అతడు చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తేజూ చేసిన సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల రూపాయల షేర్ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను అటుఇటుగా 10 కోట్ల రూపాయలకు అమ్మారు. మొదటి రోజే 3 కోట్లు వచ్చాయి. పాజిటివ్ టాక్ యాడ్ అవ్వడంతో.. మరో 4 రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలున్నాయంటోంది ట్రేడ్. ఏపీ, నైజాంలో ఈ సినిమాకు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి

మజిలీ ఫస్ట్ డే షేర్స్
నైజాం – రూ. 0.85 కోట్లు
సీడెడ్ – రూ. 0.50 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.41 కోట్లు
ఈస్ట్ – రూ. 0.38 కోట్లు
వెస్ట్ – రూ. 0.24 కోట్లు
గుంటూరు – రూ. 0.30 కోట్లు
కృష్ణా – రూ. 0.24 కోట్లు
నెల్లూరు – రూ. 0.14 కోట్లు