చిరు సినిమాకు టైటిల్ మారింది...?

Thursday,July 21,2016 - 06:20 by Z_CLU

ప్రస్తుతం తన 150వ సినిమాతో బిజీగా ఉన్నాడు చిరంజీవి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కత్తిలాంటోడు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అయితే ఇది సినిమాకు అసలైన టైటిల్ కాదని, కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమేనని 150వ సినిమా నిర్మాత రామ్ చరణ్ ప్రకటించాడు. త్వరలోనే మరో కొత్త టైటిల్ ప్రకటిస్తామని కూడా స్పష్టంచేశాడు. ఆ దిశగా ఇప్పుడు కత్తిలాంటోడు టైటిల్ ప్లేస్ లోకి తాజాగా మరో టైటిల్ వచ్చి చేరింది. చిరంజీవి 150వ సినిమాకు ఖైదీ నంబర్-150 అనే పేరు పెట్టాలని అనుకుంటున్నారట.

     గతంలో ఖైదీ, ఖైదీ నంబర్ 786 సినిమాలతో చిరంజీవి సూపర్ హిట్స్ అందుకున్నారు. తాజా మూవీలో కూడా జైలు నేపథ్యంలో ఉన్న సన్నివేశాలున్నాయి. చిరంజీవి ఖైదీ గెటప్ లో ఉన్న సన్నివేశాల్ని రామోజీఫిలింసిటీలో చిత్రీకరించారు. కాబట్టి… ఈ సినిమాకు సెంటిమెంట్ గా ఖైదీ నంబర్ 150 అనే టైటిల్ పెడితే బాగుంటుందని చాలామంది సూచించారట. చెర్రీకి కూడా ఈ టైటిల్ నచ్చినట్టు వార్తలొస్తున్నాయి. అయితే 150వ సినిమా టైటిల్ కు సంబంధించి ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. వచ్చే నెల చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా టైటిల్ ను ఎనౌన్స్ చేస్తారు.