సోలో బ్రతుకే సో బెటర్ అంటున్న చిరు

Wednesday,December 23,2020 - 12:56 by Z_CLU

లాక్ డౌన్ తర్వాత రిలీజవుతున్న పెద్ద సినిమా సోలో బ్రతుకే సో బెటర్. ఇండస్ట్రీ మళ్లీ నిలదొక్కుకోవాలన్నా, థియేటర్ వ్యవస్థ గాడిలో పడాలన్నా ఈ సినిమాను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఈసారి స్వయంగా చిరంజీవి రంగంలోకి దిగారు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకు ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నారు.

chiranjeevi promotes solo brathuke so better

క్రిస్మస్ కానుకగా రిలీజ్ అవుతున్న సోలో బ్రతుకే సో బెటర్ సినిమా యూనిట్ చిరంజీవి శుభాకాంక్షలు అందించారు. అందరూ ఫేస్ మాస్కులు ధరించి, సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని చిరంజీవి కోరారు.

సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సుబ్బు దర్శకుడు. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ తో కలిసి జీ స్టుడియోస్ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేస్తోంది.