Bangaru Bullodu - సంక్రాంతి సీజన్ లో..!

Wednesday,December 23,2020 - 11:52 by Z_CLU

అల్ల‌రి న‌రేష్ హీరోగా గిరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘బంగారు బుల్లోడు’. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అల్ల‌రి న‌రేష్ స‌ర‌స‌న నాయిక‌గా పూజా ఝ‌వేరి న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని ప్రొడ‌క్ష‌న్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి.

2021 జ‌న‌వ‌రిలో ‘బంగారు బుల్లోడు’ను విడుద‌ల చేయ‌డానికి చిత్రం బృందం స‌న్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. హీరో హీరోయిన్లు ఓ మాస్ సాంగ్‌లో డాన్స్ చేస్తున్న‌ట్లు ఆ పోస్ట‌ర్‌లో క‌నిపిస్తోంది. సాయి కార్తీక్ సంగీతం స‌మ‌కూర్చిన ఆడియో త్వ‌ర‌లో విడుద‌ల కానున్న‌ది. చిత్రంలోని పాట‌ల‌న్నింటినీ రామ‌జోగ‌య్య శాస్త్రి ర‌చించారు.

Allari Naresh Bangaru Bullodu to release in January 2

అల్ల‌రి న‌రేష్ కెరీర్‌లో ఓ చ‌క్క‌ని హాస్య‌భ‌రిత చిత్రంగా ‘బంగారు బుల్లోడు’ పేరు తెచ్చుకుంటుంద‌ని నిర్మాత‌లు తెలిపారు. టాలీవుడ్‌లోని ప‌లువురు పేరుపొందిన హాస్య‌న‌టులు ఈ చిత్రంలో న‌టించార‌నీ, వారిపై చిత్రీక‌రించిన ప‌లు స‌న్నివేశాలు ప్రేక్ష‌కులను క‌డుపుబ్బ న‌వ్వుకునేలా చేస్తాయ‌నీ చెప్పారు.

స‌తీష్ ముత్యాల సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ఎం.ఆర్‌. వ‌ర్మ ఎడిట‌ర్‌గా ప‌నిచేస్తోన్న ఈ చిత్రానికి కృష్ణ‌కిశోర్ గ‌రిక‌పాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌గా, అజ‌య్ సుంక‌ర స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.