Acharya - సెట్‌లో చిరంజీవి-మోహ‌న్‌బాబు

Thursday,December 24,2020 - 12:37 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవిని క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు క‌లిశారు. ఆ ఇద్ద‌రూ చిర‌కాల మిత్రుల‌నే విష‌యం తెలిసిందే. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. హైద‌రాబాద్‌లో ఆ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది.

మోహ‌న్‌బాబు ‘ఆచార్య’ సెట్స్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి, చిరంజీవికి బొకే ఇచ్చి, స్నేహ‌పూర్వ‌కంగా క‌లిశారు. చిర‌కాల మిత్రుడు త‌న సినిమా సెట్స్‌కు రావ‌డంతో చిరంజీవి ఆనందంతో మోహ‌న్‌బాబును ఆహ్వానించారు. ఆ ఇద్ద‌రూ కొద్దిసేపు సినిమాల‌తో పాటు వివిధ అంశాల‌పై మాట్లాడుకున్నారు.

మోహ‌న్‌బాబు ప్ర‌స్తుతం ‘స‌న్ ఆఫ్ ఇండియా’ మూవీ చేస్తున్నారు.

chiranjeevi-mohan-babu-acharya-movie-sets chiranjeevi-mohan-babu-acharya-movie-sets chiranjeevi-mohan-babu-acharya-movie-sets