హాట్ టాపిక్: చిరంజీవి నెక్ట్స్ సినిమా అదే

Saturday,April 04,2020 - 03:02 by Z_CLU

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయన సెట్స్ పైకి వెళ్తారట. ఈ మేరకు ఇండస్ట్రీలో జోరుగా డిస్కషన్ నడుస్తోంది.

ఈ కాంబినేషన్ కొత్తగా పుట్టుకొచ్చిందేం కాదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని స్వయంగా మెగాస్టార్ గతంలో ప్రకటించారు. అదే ఇప్పుడు మెటీరియలైజ్ అవ్వబోతోంది. అయితే ఇంత త్వరగా ఈ కాంబో సెట్ అవుతుందని మాత్రం ఎవ్వరూ అనుకోలేదు. దీనికి కారణాలు రెండు.

రీజన్-1
ప్రస్తుతం త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాపై వర్క్ చేస్తున్నాడు. హారిక-హాసిని బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. అయితే ఎన్టీఆర్ RRR కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాలి. ఎంత కాదనుకున్నా దాదాపు ఏడాది సమయం పట్టడం గ్యారెంటీ. కాబట్టి చిరంజీవితో మూవీ ఇప్పట్లో సాధ్యం కాదని అంతా అనుకున్నారు.

రీజన్-2
ఇక రెండో రీజన్ ఏంటంటే.. స్వయంగా రామ్ చరణ్, లూసిఫర్ అనే మలయాళ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు. చరణ్ ఆ రైట్స్ తీసుకున్నది కూడా చిరంజీవి కోసమనే విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఆచార్య తర్వాత కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై లూసిఫర్ రీమేక్ వస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాతే హారిక-హాసిని లాంటి బయట బ్యానర్ కు చిరు వెళ్తారని అనుకున్నారంతా.

కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఆచార్య కంప్లీట్ అయిన వెంటనే త్రివిక్రమ్ తోనే చిరంజీవి సెట్స్ పైకి వెళ్తారు. ఇది ఎలా సాధ్యమనేది త్వరలోనే తెలుస్తుంది.