RRRకు అలియా భట్ భరోసా

Saturday,April 04,2020 - 01:06 by Z_CLU

లాక్ డౌన్ వల్ల ప్రస్తుతం RRR షూటింగ్ జరగడం లేదు. కానీ అంతకుముందు జరిగిన షెడ్యూల్స్ లో కూడా హీరోయిన్ అలియాభట్ పాల్గొనలేదు. కొన్నిసార్లు అలియాభట్ కాల్షీట్లకు తగ్గట్టు షెడ్యూల్స్ ప్లాన్ చేయలేకపోయారు. మరికొన్నిసార్లు షెడ్యూల్స్ కు తగ్గట్టు అలియాభట్ కాల్షీట్లు ఎడ్జెస్ట్ కాలేదు.

ఇలా చాన్నాళ్లుగా వాయిదా పడుతోంది అలియాభట్ ఎంట్రీ. ఎట్టకేలకు దీనిపై అలియాభట్ నుంచి ఓ చిన్నపాటి భరోసా దక్కింది. లాక్ డౌన్ కంప్లీట్ అయి, RRR ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో, ఆ వెంటనే తను కూడా సెట్స్ పైకి వస్తానని అలియాభట్ హామీ ఇచ్చింది. ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అలియా ఈ విషయాన్ని స్పష్టంచేసింది.

దీంతో RRRలో అలియాభట్ ఉంటుందా ఉండదా అనే పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. సినిమా షూటింగ్ దాదాపు 60శాతానికి పైగా పూర్తయింది. అలియా వస్తే టాకీకి దాదాపు ప్యాకప్ చెప్పేయొచ్చు. దీనికోసమే రాజమౌళి వెయిటింగ్.