సీనియర్ నటి లిజీ లక్ష్మీ ఇంటర్వ్యూ

Wednesday,April 04,2018 - 05:02 by Z_CLU

నితిన్ 25 వ సినిమా ‘ఛల్ మోహన్ రంగ’ ఈ నెల 5 న గ్రాండ్ గా రిలీజవుతుంది. ఈ ఫన్ లోడెడ్ ఎంటర్ టైనర్ లో సీనియర్ నటి లిజీ, మేఘా ఆకాష్ కి తల్లిగా కనిపించనుంది. సినిమాలో తన క్యారెక్టర్ కి చాలా ఇంపార్టెన్స్  ఉంటుందీ అని చెప్పుకున్న లిజీ, ఈ సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. అవి మీకోసం…

నాకు తెలుగు చాలా లక్కీ…

నేను టాలీవుడ్ లో దాదాపు ఐదారేళ్ళు హీరోయిన్ గా ఉన్నాను. ఒకసారైతే జస్ట్ 1 ఇయర్ లో 8 సినిమాలు చేశాను. తెలుగు  ఇండస్ట్రీలో లేడీస్ కి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. చాలా బాగా చూసుకుంటారు. ఇన్నాళ్ళు నేను టాలీవుడ్ ని మిస్ అయ్యాను…

చాలా ఆలోచించాను…

నా కమ్ బ్యాక్ మూవీ ఫీల్ గుడ్ ఫిల్మ్ అయి ఉండాలనే అనుకున్నాను. ప్రయోగాలు చేయడం కూడా నాకిష్టమే కానీ, కానీ 25 ఏళ్ల తరవాత నన్ను చూస్తున్న వారిని డిజప్పాయింట్ చేయకూడదు అనుకునేదాన్ని. ‘ఛల్ మోహన్ రంగ’ నా కోరిక తీర్చేసింది.

నాకు పెద్ద తేడా కనిపించలేదు…

25 ఏళ్ల గ్యాప్ తరవాత కూడా నాకు పెద్ద తేడా కనిపించలేదు. మహా అయితే ఇన్నేళ్ళ తరవాత సిల్వర్ స్క్రీన్ పై నేనెలా కనిపించబోతున్నానే ఎగ్జైట్ మెంట్ చాలా ఉంది…

నిజంగా చాలా బాధ అనిపించింది…

నా కరియర్ పీక్ లో ఉన్నప్పుడు నేను సినిమాలు మానేయాల్సి వచ్చింది. పెళ్ళి, బాధ్యతలు.. అప్పటికీ నాకు సినిమాలు చేసే అవకాశం ఉన్నా, పిల్లలు నాకు ప్రయారిటీ అనిపించింది. ఇప్పుడు వాళ్ళు పెద్దయ్యాక మళ్ళీ నా కరియర్ పై ఫోకస్ బిగిన్ చేశాను.

సినిమా ఎలా ఉండబోతుంది…

చాలా ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి సినిమాలో. హీరో.. హీరోయిన్, సపోర్టింగ్ కాస్ట్, విజువల్స్ ప్రతీది సినిమాలో అద్భుతంగా ఉంటుంది.

ఆ అభిమానం మాటల్లో చెప్పలేను…

తెలుగు వాళ్ళు సినిమాని వర్షిప్ చేస్తారు. వారి అభిమానం మాటల్లో ఎక్స్ ప్లేన్ చేయడానికి కుదరదు. ఈ సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు, హైదరాబాద్ కి వచ్చినప్పుడు కూడా వాళ్ళు చూపిన అభిమానం మామూలు విషయం కాదు. ఇందుకేనేమో నేను మళ్ళీ సినిమాలు చూస్తున్నాను.

అది నా ఫేవరేట్ సీన్…

సినిమాలో ఒకచోట డైనింగ్ టేబుల్ దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ ఉంటుంది. అప్పుడు ‘ఓహ్ నైస్..’ అనే మాటను డిఫెరెంట్ గా ఒకొక్కరు ఒక్కోలా ఎక్స్ ప్రెస్ చేస్తుంటారు. ఆ సీన్ నాకు చాలా ఇష్టం. నాకు తెలిసి ఈ సినిమా  రిలీజయ్యాక ‘ఓహ్ నైస్’ అనేది అందరిలో రిజిస్టర్ అయిపోతుంది.

ఇంపార్టెంట్ మదర్…

నన్ను కృష్ణ చైతన్య కలిసినప్పుడు ఎలాగైనా ఈ క్యారెక్టర్ మీరే చేయాలి అన్నాడు. సాధారణంగా సినిమాల్లో మదర్ రోల్ కి అంత ఇంపార్టెన్స్ ఉండదు. కానీ ఈ సినిమాలో మదర్ అలా కాదు. చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. పర్ఫామెన్స్ కి స్కోప్ ఉంటుంది. అందుకే ఒప్పుకున్నాను.

చాలా న్యాచురల్ సీన్స్…

ఈ రోజుల్లో అమ్మాయిలకు అమ్మల్ని ఎలా ఇరిటేట్ చేయాలో బాగా తెలుసు. అదే మా ఇంట్లో జరుగుతుంది. అదే సినిమాలో కూడా ఉంటుంది. నాకైతే ఈ సినిమాలో మేఘా కాంబినేషన్ లో ఉండే సీన్స్ చాలా న్యాచురల్ అనిపించాయి. నాకు మా అమ్మాయి కళ్యాణి కి మధ్య ఉండే రెగ్యులర్ సిచ్యువేషన్స్ ఈ సినిమాలో మేఘ కి నాకు మధ్య ఉంటాయి.

నేను సక్సీడ్ అయ్యాను…

నేను సెట్స్ లోకి వచ్చినప్పుడు బిగినింగ్ లో కొత్తగా అనిపించింది కానీ, ఒకసారి యాక్టింగ్ బిగిన్ అయ్యాక అందరూ క్లోజ్ అయిపోయారు. నేనే కొంచెం ఎక్కువగా కష్టపడి వాళ్ళ ఏజ్ గ్రూప్ లో ఫిట్ అవ్వడానికి ట్రై చేశాను. ఆ విషయంలో నేను సక్సీడ్ అయ్యాననే అనుకుంటున్నాను.

నితిన్ న్యాచురల్ యాక్టర్…

నితిన్ చాలా జోవియల్ గా ఉంటాడు. అదే విధంగా చేసే పని విషయంలో చాలా సీరియస్ గా ఉంటాడు. ఒకరకంగా చెప్పాలంటే నితిన్ చాలా న్యాచురల్ యాక్టర్. వెరీ వెరీ ట్యాలెంటెడ్.

మేఘా తను.. సేమ్ టు సేమ్…

మేఘా బిగినింగ్ లో రెస్పెక్ట్ ఇస్తూ ఒక బ్యారియర్ లో ఉండేది, కానీ సినిమా అయిపోయేనాటికీ, ఇద్దరం నిజంగా తల్లీ కూతుళ్ళం అనేంతలా  కలిసిపోయాం.

అన్నీ కలిసొచ్చాయి…

ఒక అద్భుతమైన సినిమా తెరకెక్కాలంటే అన్నీ కలిసిరావాలి. స్టోరీ, డైరెక్టర్, మ్యూజిక్, ఆర్టిస్ట్ లు ఇలా… ఛల్ మోహన్ రంగ విషయంలో అదే జరిగింది. కాసేపు మనకున్న టెన్షన్స్, ప్రెజర్స్ అన్నీ పక్కన పెట్టేసి హ్యాప్పీగా ఎంజాయ్ చేయొచ్చు…

ప్రతి రోజు నాకు అచీవ్ మెంటే…

మాకు చెన్నై లో 2 ప్రెస్టీజియస్ డబ్బింగ్ థియేటర్స్, 2 ప్రివ్యూ థియేటర్స్ ఉన్నాయి. ప్రతీది నేనే దగ్గరుండి చూసుకుంటాను. అందుకే నాకు ప్రతి రోజు.. ప్రతీది అచీవ్ మెంటే అనిపిస్తుంది.

ఛల్ మోహన్ రంగ ఎందుకు చూడాలి…

స్ట్రెస్ రిలీఫ్ కోసం ఈ సినిమా తప్పకుండా చూడాలి. సినిమాలో ప్రతి సిచ్యువేషన్ లో మీకు బ్యూటీ కనిపిస్తుంది. హ్యాప్పీనెస్ కనిపిస్తుంది. ఫన్ ఉంటుంది…

అందంగా ఉండటానికి…

ఆరోగ్యంగా ఉండాలి, హ్యాప్పీగా ఉండాలి స్ట్రెస్ లేకుండా సరిపడా పడుకోవాలి…