జీ సినిమాలు ( 12th మార్చ్)

Wednesday,March 11,2020 - 10:02 by Z_CLU

రంగుల రాట్నం

నటీనటులు : రాజ్ తరుణ్శుక్లా
ఇతర నటీనటులు : సితారప్రియదర్శి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీచరణ్ పాకాల
డైరెక్టర్ : శ్రీరంజని
ప్రొడ్యూసర్ నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 14 జనవరి 2017

ఒక క్రియేటివ్ కంపెనీ లో ఉద్యోగిగా పనిచేసే మిడిల్ క్లాస్ అబ్బాయి విష్ణు(రాజ్ తరుణ్).. చిన్నతనంలోనే తన నాన్నని కోల్పోవడంతో అమ్మే(సితార)  తన జీవితంగా జీవిస్తుంటాడు. ఓ ఈవెంట్ కంపెనీలో పనిచేస్తూ జాగ్రత్తకి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే కీర్తి(చిత్ర శుక్లా)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. తను ప్రేమించిన విషయాన్ని  అమ్మతో చెప్పి కీర్తికి  చెప్పలనుకుంటూ చెప్పలేకపోతుంటాడు. అలాంటి టైమ్ లో అనుకోని ఓ సంఘటన విష్ణు జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ టైంలో  విష్ణుకి దగ్గరవుతుంది కీర్తి. అలా ప్రియురాలిగా తన జీవితంలోకి ఎంటర్ అయిన కీర్తి తన అతి జాగ్రత్త వల్ల విష్ణుకి కోపం తెప్పిస్తుంటుంది. ఈ క్రమంలో విష్ణు  అమ్మ ప్రేమ- అమ్మాయి ప్రేమ ఒకటే అని ఎలా తెలుసుకున్నాడు అనేది సినిమా కథాంశం.

_____________________________________

తడాఖా

నటీనటులు నాగచైతన్యసునీల్తమన్నాఆండ్రియా జెరెమియా
ఇతర నటీనటులు ఆశుతోష్ రానానాగేంద్ర బాబుబ్రహ్మానందంవెన్నెల కిషోర్రఘుబాబురమాప్రభ మరితు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ : కిషోర్ కుమార్ పార్ధసాని
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 10th మే 2013


నాగచైతన్యసునీల్ అన్నాదమ్ములుగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తడాఖా. తండ్రి చనిపోగానే వచ్చిన పోలీసాఫీసర్ ఉద్యోగంలో ఇమడలేని అన్నకు తమ్ముడు ఎలాచేదోడు వాదోడుగా నిలిచాడుకథ చివరికి ఏ మలుపు తిరిగిందనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

_________________________________________________

అదిరిందయ్యా చంద్రం

నటీనటులు  – శివాజీలయ

ఇతర నటీనటులు – సంగీతమధుశర్మబ్రహ్మానందంఅలీవేణుమాధవ్ఏవీఎస్

మ్యూజిక్ డైరెక్టర్ – ఎం.ఎం.శ్రీలేఖ

డైరెక్టర్  – శ్రీనివాసరెడ్డి

రిలీజ్ డేట్  – 2005, ఆగస్ట్ 20

శివాజీలయ కలిసి నటించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అదిరిందయ్యా చంద్రం.  శివాజీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. శివాజీలో అదిరిపోయే కామెడీ టైమింగ్ ఉందని మరోసారి నిరూపించింది ఈ సినిమా.

_____________________________________________

రాఖీ

నటీనటులు : NTR, ఇలియానాచార్మి
ఇతర నటీనటులు సుహాసినిరవి వర్మప్రకాష్ రాజ్కోట శ్రీనివాస రావుచంద్ర మోహన్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ కృష్ణవంశీ
ప్రొడ్యూసర్ : K.L. నారాయణ
రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2006


NTR, 
కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన రాఖీ ఇద్దరి కరియర్ లోను డిఫరెంట్ సినిమా. ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక యువకుడు చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని పోరాటం చేయడమే రాఖీ సినిమా ప్రధానాంశం. ఈ సినిమాలో ఛార్మి నటన హైలెట్.

_____________________________________________

అ..ఆ

నటీనటులు : నితిన్సమంతా అక్కినేని , అనుపమ పరమేశ్వరన్

ఇతర నటీనటులు : నరేష్నదియాహరితేజఅనన్యరావు రమేష్శ్రీనివాస్ అవసరాల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ.జె.మేయర్

డైరెక్టర్ : త్రివిక్రమ్

ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ

రిలీజ్ డేట్ : 2 జూన్ 2016

నితిన్సమంతా జంటగా నటించిన బ్యూటిఫుల్ లవ్ ఎంటర్ టైనర్ అ..ఆ. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అనసూయ (సమంతా)తల్లి క్రమశిక్షణతో విసుగెత్తి పోతుంది. దానికి తోడు తన ఇష్టా ఇష్టాలతో సంబంధం కుదర్చడం మరో తలపోతులా ఫీలవుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తండ్రి సలహా మేరకు తన మేనత్త ఇంటికి  వెళ్తుంది. ఆనంద్  విహారి ( నితిన్) తో పాటుతక్కిన ఫ్యామిలీని కలుసుకుంటుంది. ఆస్తిఆర్భాటాలు లేకపోయినా అనురాగ ఆప్యాయతలతో  ఉండే ఆ ఫ్యామిలీని ఇష్టపడటమే కాదు ఆనంద్ విహారితో ప్రేమలో కూడా పడుతుంది అనసూయ.  ఆ తరవాత ఏం జరుగుతుంది..అనేదే ఈ సినిమాలో ప్రధాన కథాంశం.

_______________________________________

ఛల్ మోహన్ రంగ

నటీనటులు : నితిన్మేఘా ఆకాష్

ఇతర నటీనటులు మధునందన్రావు రమేష్నరేష్లిస్సిసంజయ్ స్వరూప్ప్రగతి మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ కృష్ణ చైతన్య

ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి

రిలీజ్ డేట్ : 5 ఏప్రిల్ 2018

చిన్నతనం నుండి పెద్దగా చదువు అబ్బకపోవడంతో ఎప్పటి కైనా అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అవ్వలనుకుంటాడు మోహన్ రంగ(నితిన్). ఎన్నిసార్లు ట్రై చేసినా వీసా రాకపోవడంతో ఓ ప్లాన్ వేసి యు.ఎస్ వెళ్తాడు. అలా వెళ్ళిన మోహన్ రంగ విలాస్(మధు నందన్) సహయంతో అక్కడ ఓ ఉద్యోగం సంపాదిస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా పరిచయమైన మేఘా సుబ్రహ్మణ్యం(మేఘ ఆకాశ్) తో ప్రేమలో పడతాడు. మోహన్ రంగ క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వడంతో మేఘ కూడా ప్రేమలో పడిపోతుంది. ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమించుకుంటారు. అలా ఒకరినొకరు ఇష్టపడుతూ చెప్పుకునేలోపే ఎలాంటి కారణం లేకుండా దూరమవుతారు. అలా అనుకోకుండా దూరమయిన వీళ్ళిద్దరూ ఏడాది తర్వాత మళ్ళీ ఊటీలో కలుసుకుంటారు. ఇంతకీ మోహన్ రంగ-మేఘ వీరి మధ్య జరిగిన సంఘటనలు ఏమిటి ..చివరికి వీరిద్దరూ ఎలా ఒకటయ్యారు… అనేది మిగతా కథ.