‘నా పేరు సూర్య’ ఓవర్ సీస్ రైట్స్ దక్కించుకున్న GIF

Wednesday,April 04,2018 - 04:01 by Z_CLU

అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ మే 4 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. 2 సాంగ్స్ మినహా ఆల్మోస్ట్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ స్పీడ్ అందుకుంది. నా పేరు సూర్య ఓవర్ సీస్ రైట్స్ ని దక్కించుకున్న గ్రేట్ ఇండియా మూవీస్ ఈ సినిమాని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తుంది.

U.S.A. లో మే 3 న రిలీజ్ కానున్న ఈ సినిమాకి ఇప్పటి నుండే భారీ స్థాయిలో డిమాండ్ క్రియేట్ అవుతుంది. అల్లు అర్జున్ ని మోస్ట్ అగ్రెసివ్ మిలిటరీ ఆఫీసర్ గా ప్రెజెంట్ చేయనున్న ఈ సినిమా, సెన్సేషనల్ హిట్ గ్యారంటీ అంటున్నాయి సోర్సెస్. DJ లాంటి భారీ హిట్ తరవాత రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఓవర్ సీస్ లోను నెక్స్ట్ లెవెల్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.

 

లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే 2 సాంగ్స్ ని రిలీజ్ చేసిన సినిమా యూనిట్ త్వరలో ఈ సినిమా ఆడియో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకి వక్కంతం వంశీ డైరెక్టర్.