చైతూ -సమంత మూవీ అప్డేట్స్

Sunday,April 29,2018 - 01:02 by Z_CLU

ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ‘సవ్య సాచి’ సినిమా చేస్తున్నాడు  నాగ చైతన్య. ఈ సినిమాతో పాటే మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న చైతూ మరో వైపు సమంత కలిసి నటించబోతున్న సినిమాను కూడా స్టార్ట్ చేయబోతున్నాడు.

నానితో ‘నిన్ను కోరి’ సినిమాను తెరకెక్కించిన  శివ నిర్వాణ చైతూ సమంతతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను అటు నాగచైతన్య, ఇటు సమంత జాయింట్ గా ప్రకటించారు కూడా.

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా మే 5 నుండి సెట్స్ పైకి రానుందని సమాచారం.