సునీల్ కోసం నిర్మాతగా అల్లరి నరేష్ ?

Sunday,April 29,2018 - 03:07 by Z_CLU

ప్రెజెంట్ సునీల్ అల్లరి నరేష్ ఇద్దరూ కలిసి ఓ కామెడి ఎంటర్టైనర్ సినిమా చేస్తున్న స్నాగతి తెలిసిందే.. అల్లరి నరేష్ తో సుడిగాడు తీసి సూపర్ హిట్ అందుకున్న భీమినేని శ్రీనివాస రావు ఈ సినిమాకు డైరెక్టర్. ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజికి చేరుకున్న ఈ సినిమా తర్వాత అల్లరి నరేష్ సునీల్ తో ఓ సినిమా నిర్మించబోతున్నాడట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని సమచారం. ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడు ఇండస్ట్రీ కి పరిచయం కానున్నాడని తెలుస్తుంది.

తండ్రి మరణం తర్వాత ఈ.వీ.వీ సినిమా బ్యానర్ లో కేవలం ‘బందిపోటు’ అనే సినిమా మాత్రమే తీసిన ఈ.వీ.వీ బ్రదర్స్ ఈ సినిమాతో మళ్ళీ వరుసగా సినిమాలు నిర్మించాలని భావిస్తున్నారట. అయితే అల్లరి నరేష్ ఈ సినిమాకు కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తాడని నటించని సమాచారం.