కోలీవుడ్ పై కన్నేసింది...

Monday,October 24,2016 - 03:37 by Z_CLU

తెలుగులో ఇప్పటికే అనసూయకు మాంఛి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోగ్గాడే చిన్ని నాయనా, క్షణం సినిమాలతో పాపులర్ అయిన ఈ అమ్మడు… మళ్లీ ఆ రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. అయితే హాట్ హాట్ ఫొటోషూట్లు, బుల్లితెర కార్యక్రమాలతో నిత్యం సందడి చేస్తూనే ఉంది. తాజాగా ఈ బ్యూటీ తమిళ పరిశ్రమపై కన్నేసింది. కోలీవుడ్ లో ఓ సినిమా చేసేందుకు అనసూయ రెడీ అవుతోంది.

           నిజానికి ఈ కోలీవుడ్ ఆఫర్ కొత్తదేం కాదు. తెలుగులో హిట్ అయిన క్షణం సినిమానే తమిళ్ లో తీస్తున్నారు. తెలుగులో పోషించిన నెగెటివ్ పాత్రనే తమిళ్ లో కూడా అనసూయకు ఆఫర్ చేశారు. ఇక హీరోయిన్ ఆదాశర్మకు కూడా సేమ్ క్యారెక్టర్ ఆఫర్ చేశారు. ఎటొచ్చి హీరో మాత్రం మారిపోయాడు. తెలుగులో అడివి శేషు పోషించిన హీరో పాత్రను… తమిళ్ లో శిబి పోషించడానికి రెడీ అవుతున్నాడు. ఈ శిబి అంటే వేరెవరో కాదు… మన కట్టప్ప సత్యరాజ్ కొడుకు. సో.. తెలుగులో తనకు అచ్చొచ్చిన సినిమాతో తమిళ్ లో కూడా   క్రేజ్ తెచ్చుకోవాలనుకుంటోంది అనసూయ.