సరి కొత్త గెటప్ లో బన్నీ ?

Sunday,November 13,2016 - 08:30 by Z_CLU

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హరీష్ శంకర్ దర్శకత్వం లో నటిస్తున్న చిత్రం ‘డి.జె(దువ్వాడ జగన్నాధం) ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో బన్నీ లుక్ సరికొత్త గా ఉండబోతుందట. అంతేకాదు ఇప్పటివరకూ బన్నీని చూడని సరికొత్త గెటప్ లో చూపించబోతున్నాడట దర్శకుడు హరీష్ శంకర్.

   ఇక ‘రేసుగుర్రం’ లో సాధారణ కుర్రాడిలా కనిపించిన బన్నీ ఆ తరువాత ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లో స్టైలిష్ గా ఆకట్టుకున్నాడు. ఇటీవలే సరైనోడు లో మాస్ గెటప్ లోనూ అలరించాడు. ఇలా ప్రతి సినిమాలో ఓ కొత్త గెటప్ లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న బన్నీ ఈ చిత్రం ఓ బ్రాహ్మణ కుర్రాడి గెటప్ లో పంచెకట్టుతో కనిపించనున్నాడట. ఈ గెటప్ తో పాటు మరో మాస్ లుక్ లోనూ బన్నీ పూర్తి స్థాయిలో ఎంటర్ టైన్ చేస్తాడని తెలుస్తోంది.