భారీ ప్రమోషన్స్...

Sunday,November 13,2016 - 09:30 by Z_CLU

సూపర్ స్టార్ రజనికాంత్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘రోబో-2 ‘ గతంలో శివాజీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ‘రోబో’ తో ఇండస్ట్రీ హిట్ సాధించిన వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి.

    ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈ నెల 20 న విడుదల చేయనున్నారు. వచ్చే నెల నుండే సరికొత్త ప్లాన్ తో ఈ సినిమా ప్రమోషన్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేసి సినిమా పై ఇంకాస్త హైప్ పెంచడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ ప్రచారాన్ని కూడా బాలీవుడ్ నుంచి మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఆ ప్రచార వ్యూహం ఏంటనేది ఫస్ట్ లుక్ రిలీజ్ రోజు తెలుస్తుంది. అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రం లో రజని సరసన అమీ జాక్సన్ కథానాయికగా నటిస్తుంది.  ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు .