హిట్ హీరోకు ఇప్పుడు సెంటిమెంట్ కలిసొస్తోంది..

Sunday,November 13,2016 - 08:00 by Z_CLU

ఓవైపు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఆడియన్స్ కు ఏదైతే నచ్చుతుందో అదే చేస్తున్నాడు. తనను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలుసు కాబట్టే… నాని సెలక్ట్ చేసుకున్న ప్రతి సినిమా హిట్ అవుతుంది. భలే భలే మగాడివోయ్ సినిమా నుంచి నిన్నటి మజ్ను వరకు వరుసగా సక్సెస్ లు అందుకుంటూనే ఉన్నాడు నాని. తాజాాగా మజ్ను సినిమా 50 రోజులు కూడాా పూర్తిచేసుకుంది. ఇలా విజయాలతో దూసుకెళ్తున్న నానికి ఇప్పుడు మరో గోల్డెన్ హ్యాండ్ కూడాా యాడ్ అయింది.

   keerthy-suresh-still

   ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణం లో త్రినాధ్ రావు దర్శకత్వంలో నాని నటిస్తున్న ‘నేను లోకల్’ సినిమాలో  కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘నేను శైలజ’ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమా తో తెలుగులో మంచి విజయం అందుకుంది. తెలుగు లోనే కాదు తమిళ్ లోనూ ఈ భామ గోల్డెన్ లెగ్ గా మారింది. హీరోలకు వరుసగా హిట్స్ ఇస్తోంది. ఇప్పుడీ గోల్డెన్ హ్యాండ్ నానితో కలిసింది. ఓవైపు నాని మాంఛి స్వింగ్ లో ఉన్నాడు.. ఈమెదేమో లక్కీ హ్యాండ్. ఇంకేముంది నేను లోకల్ సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ బలపడిపోయింది.