బ్రాండ్ బాబు హీరో సుమంత్ శైలేంద్ర ఇంటర్వ్యూ

Tuesday,July 31,2018 - 01:33 by Z_CLU

ప్రభాకర్ డైరెక్షన్ లో తెరకెక్కింది బ్రాండ్ బాబు సినిమా. మారుతి కథ, మాటలు అందించిన ఈ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. అయితే ఈ సినిమాతో సుమంత్ శైలేంద్ర హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. కన్నడలో ఇప్పటికే 4 సినిమాలు చేసిన ఈ సుమంత్ శైలేంద్ర ఈ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సందర్భంగా మీడియాతో బ్రాండ్ బాబు గురించి చాలా విషయాలు చెప్పుకున్నాడు.

ఇది మారుతి బ్రాండ్…

బ్రాండ్ పిచ్చి అంతో కొంతో అందరికీ ఉంటుంది. మరీ బ్రాండే ఎవ్రీ థింగ్ అనుకునే యంగ్ స్టర్ రోల్ ప్లే చేశాను ఈ సినిమాలో. మారుతి గారిని చాలా రోజుల నుండి సినిమా చేద్దామని అడుగుతూనే ఉన్నాను. ఆయనకున్న కమిట్ మెంట్స్ ని బట్టి ఆయనతో సినిమా చేయాలంటే ఇంకా 3 ఇయర్స్ వెయిట్ చేయాలి. అందుకే ఆయన స్టోరీతో ప్రభాకర్ డైరెక్షన్ లో చేశాను. ఇది కంప్లీట్ గా మారుతి బ్రాండ్ సినిమా.

అందుకే తెలుగులో….

టాలీవుడ్ సినిమా మార్కెట్ చాలా బావుంది. ఇక్కడ ప్రేక్షకులు  సినిమాను పండగలా సెలెబ్రేట్ చేసుకుంటారు. కన్నడలో 4 సినిమాలు చేశాక ఇక్కడ కూడా లక్ చేసుకోవాలనిపించింది.

నాన్నా చాలా పెద్ద ప్రొడ్యూసర్…

నాన్న 30 ఏళ్లుగా కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. ఉపేంద్ర, సుదీప్ లాంటి బిగ్ స్టార్స్ తో సినిమాలు చేసి ఉన్నారు. తెలుగులో కూడా రాజ్ తరుణ్ తో ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమా నిర్మించారు. అప్పుడే టాలీవుడ్ లో తెలుగు వాళ్ళు సినిమాని ఎంత ప్రేమిస్తారో అర్థమయింది.

 

అప్పుడే డిసైడ్ అయ్యా…

ఒకసారి ఉపేంద్ర గారితో సినిమా చేస్తున్నప్పుడు తెలుగు వాళ్ళు ఆయన్ని ఎంతగా అభిమానిస్తారో చూసి షాక్ అయ్యాను. ఒకాయనైతే ఉపేంద్ర గారు ఒక సినిమాలో ప్యాంట్స్ కి బదులు లుంగీ కట్టుకోమని చెప్పారని లైఫ్ లాంగ్ లుంగీనే కట్టుకుంటున్నారట.. అలా ఉంటుందీ ఇక్కడి వారి అభిమానం… అందుకే ఎలాగైనా తెలుగు సినిమాలు చేయాలని ఫిక్సయ్యా…

ఆయనే ఇన్స్ పిరేషన్…

నేను బన్నికి చాలా పెద్ద ఫ్యాన్… ఆయన చేసిన ఆర్య సినిమా నాకు చాలా ఇష్టం… ఆ సినిమా లైఫ్ ని మార్చేసింది.

సినిమాలో నా క్యారెక్టర్…

సినిమాలో నాకు చాలా బ్రాండ్ పిచ్చి. అలాంటి కుర్రాడు ఒక పనమ్మాయితో  ప్రేమలో  పడ్డాక అతని లైఫ్ ఎలా చేంజ్ అయిందనేదే సినిమా…

అలా ఎంకరేజ్ చేశారు…

సినిమాల్లోకి రాకముందే రెండేళ్ళు ట్రైనింగ్ తీసుకున్నాను. బిగినింగ్ లో డ్యాన్స్ మాస్టర్స్, ఫైట్ మాస్టర్స్ మా ఇంటికే వచ్చి నేర్పేవారు.  ఆ తరవాత ముంబై కి వెళ్లి కూడా ట్రైనింగ్ తీసుకున్నాను…

నాన్న చెప్పింది ఒకటే…

సినిమాల్లోకి రాకముందు నాన్న చెప్పింది ఒకటే.. ఒకసారి సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చావంటే వెనక్కి రావడం కుదరదు. 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాం. అలాంటప్పుడు నీ పర్ఫామెన్స్ బాలేదు అనే మార్క్ ఎట్టి పరిస్థితుల్లో పడకూడదు అన్నారు.. అందుకే పక్కా ట్రైనింగ్ తీసుకుని వచ్చాను…

ఇంటర్వెల్ సీన్ ఆయనే చేశారు..

సినిమాలో ఇంటర్వెల్ లో ఉండే సీన్ ని మారుతి గారు డైరెక్ట్ చేశారు. ఆ రోజు ప్రభాకర్ గారు రాలేదు… ఆ సీన్లో 30 నుండి 40 మంది వరకు ఉంటారు.. కంప్లీట్ గా ఎండలో షూట్ చేశాం…

అదే బ్రాండ్ బాబు..

ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా. ఫ్యామిలీస్… యూత్.. అందరూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూడొచ్చు… క్లీన్ కామెడీ ఎంటర్ టైనర్ విత్ క్యూట్ లవ్ స్టోరీ…

మారుతి గారు అదే చెప్పారు…

కన్నడలో నేను భారీ కమర్షియల్ సినిమాలు చేశాను. కానీ తెలుగు డెబ్యూ వరకు వచ్చేసరికి ఫస్ట్ ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చెయ్.. ఆ తరవాత కమర్షియల్ సినిమా చేద్దువు గానీ అన్నారు.. నా నెక్స్ట్ సినిమా ఈ సినిమాకి వచ్చే రెస్పాన్స్ ని బట్టి ఉంటుంది. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయితే కంపల్సరీగా కమర్షియల్ ఎంటర్ టైనర్ ఉంటుంది.. లేకపోతే మళ్ళీ ఇలాంటి లైట్ హార్టెడ్ మూవీ ఉంటుంది.