విజయ్ దేవరకొండ సినిమాలో అనూ ఇమ్మానుయేల్

Thursday,May 24,2018 - 01:34 by Z_CLU

పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విజయ్ దేవరకొండ సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా కోసం అనూ ఇమ్మానుయేల్  కూడా సంతకం చేసిందన్న న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.

కరియర్ బిగినింగ్ లోనే టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ సరసన నటించే చాన్స్ కొట్టేసిన అనూ ఇమ్మానుయేల్, ఈ సినిమాలో కామియో రోల్ లో మెస్మరైజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. సినిమాలో హెవీ ఇంపాక్ట్ క్రియేట్ చేసే రోల్ లో అనూ కనిపించనుందనే న్యూస్ సోషల్ మీడియాలోను స్ట్రాంగ్ గా సర్క్యులేట్ అవుతుంది. అయితే ఈ విషయం ఇంకా అఫీషియల్ గా కన్ఫం కాలేదు.

 

రీసెంట్ గా ‘నా పేరు సూర్య’ సక్సెస్ తో మరింత క్రేజ్ పెంచుకున్న అనూ ఇమ్మానుయేల్ , ప్రస్తుతం నాగచైతన్య ‘శైలాజా రెడ్డి అల్లుడు’ సినిమాతో బిజీగా ఉంది.