ఈ వీకెండ్ సినిమాలు

Thursday,May 24,2018 - 11:36 by Z_CLU

ఇప్పటికే థియేటర్లలో మహానటి సినిమా స్ట్రాంగ్ గా రన్ అవుతోంది. మరోవైపు భరత్ అనే నేను సినిమా ఉండనే ఉంది. వీటికి తోడు కాశి, మెహబూబా లాంటి చిత్రాలు కూడా మార్కెట్లో ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో థియేటర్లలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాయి 2 సినిమాలు. రేపు రిలీజ్ కానున్న ఆ రెండు సినిమాలేంటో చూద్దాం.

 

ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న సినిమా నేలటిక్కెట్టు. మాస్ మహారాజ్ రవితేజ నటించిన సినిమా ఇది. ఇన్నాళ్లు క్లాస్ సినిమాలు తీసిన కల్యాణ్ కృష్ణ, ఈసారి రవితేజతో ఫస్ట్ టైం ఓ మాస్ సినిమా ట్రై చేశాడు. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాతో మాళవిక శర్మ ఇండస్ట్రీకి పరిచయమౌతోంది. శక్తికాంత్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

 

రవితేజ సినిమాకు పోటీగా వస్తోంది అమ్మమ్మగారిల్లు. నాగశౌర్య, షామిలి జంటగా నటించిన ఈ సినిమాకు సుందర్ సూర్య దర్శకుడు. కుటుంబ బంధాలు, ఉమ్మడి కుటుంబంలో ఉన్న అనుబంధాల్ని బేస్ చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. క్లీన్-U సర్టిఫికేట్ తో వస్తున్న ఈ సినిమాకు కల్యాణ రమణ సంగీతం అందించాడు.

ఈ వీకెండ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ రెండు సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.