యంగ్ హీరోతో బోయపాటి రెడీ ..

Sunday,October 23,2016 - 09:00 by Z_CLU

తాజాగా ‘సరైనోడు’ తో గ్రాండ్ హిట్ అందుకున్న దర్శకుడు బోయపాటి కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ కి కారణం బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రమే. ‘అల్లుడు శ్రీను’తో హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చెయ్యబోతున్నాడు మాస్ డైరెక్టర్ బోయపాటి.

hym30bellamkondasr_2715785f
మొన్నటివరకూ ఈ కాంబినేషన్ లో సినిమా పై ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉండదనే టాక్ కూడా వినిపించింది. ఎట్టకేలకు ఈ యంగ్ హీరో తో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు బోయపాటి. నవంబర్ 4 న సినిమాను ప్రారంభించి సమ్మర్లో సినిమాను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించనున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నిర్మించనున్నారు.