రూట్ మార్చింది...

Sunday,October 23,2016 - 09:30 by Z_CLU

టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి, కొన్నేళ్లు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన త్రిష ప్రస్తుతం తన రూట్ మార్చింది. ఇటీవలే లేడి ఓరియెంటెడ్ గా తెరకెక్కిన ‘నాయకి’ సినిమాతో కోలీవుడ్, టాలీవుడ్ లో సందడి చేసిన ఈ సీనియర్ కథానాయిక ప్రస్తుతం విలక్షణ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యాలని డిసైడ్ అయ్యింది.

cveqi-suaaadj95

   నాయకి తరువాత అదే రూట్ లో మరో లేడి ఓరియెంటెడ్ చిత్రం ‘మోహిని’ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న త్రిష… ఈ సినిమా ఫస్ట్ లుక్ తో అందరి చూపును తన వైపు  తిప్పుకుంది.అలాగే ధనుష్ తో నటించిన ‘కొడి’ చిత్రం లోనూ ఓ నెగటివ్ క్యారెక్టర్ చేసిందట. ఈ చిత్రం తెలుగు లో ధర్మ యోగి టైటిల్ తో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో త్రిష ధనుష్ సరసన కథానాయికగా నటించిందని అనుకున్నారంతా కానీ ఈ సినిమాలో త్రిష ఓ నెగటివ్ రోల్లో కనిపించబోతుందని తెలియజేసారు చిత్ర యూనిట్. మరి కథానాయికగా కొత్త ప్రయోగాలు చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్న త్రిష ఈ సినిమాలతో ఎలాంటి విజయాలు అందుకుంటుందో? చూడాలి.