సూపర్ స్టార్ తో మెగాహీరో..

Sunday,October 23,2016 - 08:30 by Z_CLU

ఇటీవలే ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగా హీరో అల్లు శిరీష్ తన మార్కెట్ పెంచుకునే పనిలో పడ్డాడు. ఇక ఇప్పటికే స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మల్లూవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడా క్రేజ్ తో బన్నీ బ్రదర్ గామలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు శిరీష్.

   మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి స్క్రీన్ చేసుకోబోతున్నాడు అల్లు శిరీష్. మోహన్ లాల్ కథానాయకుడిగా 1971 బియాండ్ బోర్డర్స్ అనే చిత్రంలో ట్యాంక్ కమాండర్ గా కీలక పాత్ర ప్లే చేయనున్నాడు అల్లు వారబ్బాయి. మేజర్ రవి ఈ చిత్రానికి దర్శకుడు.