ఈ దసరాకు మిక్స్ మసాలా

Friday,September 30,2016 - 10:00 by Z_CLU

 దసరా ఫెస్టివల్ కి నువ్వా నేనా అంటూనే, చాలా సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అయ్యబాబోయ్ ఇన్ని సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి, ఇంత కాంపిటీషన్ లో ఎలా వర్కవుట్ అవుతుందబ్బా అని ఆలోచించే లోపే, ఒక ఇంటరెస్టింగ్ పాయింట్ తట్టింది. అసలు ఈ సినిమాల్లో దేనికి ఏదీ కాంపిటీషనే కాదు. ప్రతి సినిమాకూ ఓ స్పెషల్ కలరింగ్ ఉంది

 

రామ్ హీరోగా నటించిన హైపర్ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. తండ్రిని అమితంగా ఇష్టపడే కుర్రాడిగా రామ్… ఓ మంచి ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ ని మనముందుకు తీసుకొచ్చాడు. దసరా బరిలో ఈ సినిమా ఒక్కటే సోలోగా విడుదల అవుతోంది. మిగతా సినిమాలన్నీ 6, 7 తేదీల్లోనే థియేటర్లలోకి వస్తున్నాయి.

jaguar1-1

మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ కుమార్, జాగ్వార్ సినిమాతో దసరా బరిలో నిలిచాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను అక్టోబర్ 6న విడుదల చేస్తున్నారు. తమన్న ఐటెం సాంగ్ ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్.

sai_22930037

జాగ్వార్ సంగతలా ఉంచితే, మస్తు మాసేనా…? నాకేం తక్కువ అంటూ రొమాన్స్ కూడా ఈ దసరా సందడిలో దూరేసిందండోయ్. ఎప్పటి నుండో కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తున్న నాగచైతన్య ప్రేమమ్, ఆహ్లాదంగా ఉండే పండగ వాతావరణంలో రొమాంటిక్ మత్తును చల్లడానికి అక్టోబర్ 7 న రిలీజవుతుంది. ఇక కామెడీ కంటెంట్ తో “ఈడు గోల్డె ఎహే” అనిపించుకోడానికి అదే రోజు బరిలోకి దిగుతున్నాడు సునీల్. ఓ వైపు రొమాన్స్, మరో వైపు కామెడీ అలా అలా సరదాగా మెస్మరైజ్ అయ్యే లోపే…. అల్టిమేట్ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అవుతున్న అభినేత్రి కూడా 7నే హారర్ కాన్సెప్ట్ తో హడలెత్తించనుంది. హిట్లు, ఫ్లాపులు అనే లెక్కల్ని పక్కనపెడితే… ఈసారి దసరా సంబరాలకు మాంఛి మసాలా ఫ్లేవర్ యాడ్ అయింది.