బాహుబలి-2పై ఉత్కంఠ

Thursday,September 29,2016 - 05:01 by Z_CLU

ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న బాహుబలి-2 గురించి ఎలాంటి వార్త బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు రాజమౌళి. ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి కొన్ని ఫోటోలు ట్వీట్ చేయగా… రానా దగ్గుబాటి ఓ ఫోటో ను ట్వీట్ చేశాడు. ఇంతకుమించి ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ గా ఇంకేమీ రాలేదు. కనీసం ప్రెస్ నోట్ కూడా బయటకు రాలేదు. అంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్న రాజమౌళి సెడన్ గా తన సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు. దీంతో అందరి దృష్టి మరోసారి బాహుబలి-2పై పడింది.

baahubali-1

జక్కన్నతో పాటు పలువురు బాహుబలి యూనిట్ సభ్యులు రేపు మీడియాతో సమావేశం కాబోతున్నారు. ఇంత సెడన్ గా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. తన ప్రతి ప్రెస్ మీట్ లో సినిమా స్టోరీని ముందుగానే చెప్పేస్తాడు రాజమౌళి. మరి బాహుబలి-2 సినిమా స్టోరీని కూడా అలానే చెప్పేస్తాడా… లేక సినిమా విడుదల తేదీ, టీజర్ రిలీజ్ డేట్స్ ను అధికారికంగా ప్రకటించడానికే ఈ ప్రెస్ మీట్ పెడుతున్నారా… లేక కొత్తగా బాహుబలి-2లోకి క్రేజీ నటీనటులు చేరబోతున్నారా…  ఏ విషయం ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది.