సెంటిమెంట్ తో చరిత్ర సాధ్యమా..?

Friday,September 30,2016 - 10:30 by Z_CLU

 గతేడాది ‘బాహుబలి’ తో ప్రభాస్, ‘శ్రీమంతుడు’ తో మహేష్ బాబు పోటీ పడడానికి సిద్దమయ్యారు. జూలై 10న రెండు సినిమాలు విడుదల అని ప్రకటించేశారు. మళ్ళీ ఒకరి తేది ఒకరికి తెలియలేదంటూ పొరపాటు పడ్డారు. ఆ తరువాత ‘బాహుబలి’ మన టాలీవుడ్ గర్వపడే సినిమా కావడంతో మహేష్ ఒక అడుగు వెనక్కి తగ్గి… ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని ఆగస్ట్ 7 కు పోస్ట్ పోన్ చేసాడు. కాగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద గొప్ప విజయాలు అందుకొని మంచి వసూళ్లు సాధించాయి.

       అయితే తాజాగా ఈ ఇద్దరు మళ్ళీ పోటీ పడబోతున్నారు. ‘బాహుబలి-2’ ను వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు యూనిట్. సరిగ్గా ఇదే తేది న మహేష్ ప్రస్తుతం మురుగదాస్ తో చేస్తున్న సినిమాను కూడా విడుదల చెయ్యాలని చూస్తున్నారట. ఎందుకంటే… ఏప్రిల్ 28న పోకిరి రిలీజ్ అయింది కాబట్టి.. అదే డేట్ అయితే.. మురుగదాస్ సినిమాకు కూడా కలిసొస్తుందని మహేష్ ఫీలింగ్.

bahubali-srimanthudu

అయితే ఇక్కడే మరో సెంటిమెంట్ కూడా ఉందంటోంది ఫిలింనగర్. గతంలో ఇలానే క్లాష్ అయి, వెనక్కి తగ్గడం వల్ల రెండు సినిమాలూ లాభపడ్డాయి. సో.. ఈసారి కూడా ఓ వారం రోజులు వెనక్కి తగ్గితే… అటు బాహుబలి-2తో పాటు.. ఇటు మహేష్ బాబు సినిమా కూడా హిట్ అవుతుందనే సెంటిమెంట్ డెవలప్ అయింది. సో.. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అయి, సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు.