నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Saturday,February 22,2020 - 11:42 by Z_CLU

భీష్మ సినిమాతో ఫుల్ జోష్ లోకి వచ్చేశాడు నితిన్. ఈ సినిమా కేవలం హిట్టవ్వడం మాత్రమే కాదు, నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా కూడా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ సినిమాకు 6 కోట్ల 28 లక్షల రూపాయల షేర్ వచ్చింది. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 8 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 19 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో.. వచ్చే వీకెండ్ నాటికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం గ్యారెంటీ అంటోంది ట్రేడ్.

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్స్
నైజాం – 2.20 కోట్లు
సీడెడ్ – 0.80 కోట్లు
ఉత్తరాంధ్ర – 0.62 కోట్లు
గుంటూరు – 0.77 కోట్లు
ఈస్ట్ – 0.66 కోట్లు
వెస్ట్ – 0.56 కోట్లు
కృష్ణా – 0.40 కోట్లు
నెల్లూరు – 0.27 కోట్లు