NBK107 First Look అంచనాలు పెంచేసిన బాలయ్య

Monday,February 21,2022 - 05:19 by Z_CLU

Nandamuri Balakrishna’s first look from #NBK107 released

నందమూరి బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘NBK107’ సినిమాకు సంబంధించి బాలకృష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. రెండ్రోజుల క్రితం షూటింగ్ మొదలైన ఈ సినిమా నుండి బాలయ్య లుక్ లీకయింది. షూటింగ్ స్పాట్ లో బాలయ్య గెటప్ తో కూర్చున్న లీక్ ఫొటోస్ వైరల్ అవ్వడంతో మేకర్స్ చేసేదేం లేక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేశారు. ఈరోజు ఉన్నపళంగా ఓ ముహూర్తానికి ఫస్ట్ లుక్ వదిలి బాలయ్య ఫ్యాన్స్ ని ఖుషి చేశారు.

NBK107-First-look-poster-balakrishna-gopichand-malineni-zeecinemalu

మైనింగ్ లో బాలయ్య ఒక కారు పక్కన నడుస్తూ  పంచె కట్టుతో ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తోంది. ఫస్ట్ టైం బాలయ్యతో చేస్తున్న సినిమా కావడంతో లుక్ పై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు గోపీచంద్ మలినేని.

ప్రస్తుతం సిరిసిల్ల సమీపంలో యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు యూనిట్.  రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేస్తున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ మొదలు పెట్టారు. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటించనుంది. దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నాడు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics