బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకు మరో హీరోయిన్ ఫిక్స్

Sunday,April 01,2018 - 02:08 by Z_CLU

త్వరలోనే సాక్ష్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న బెల్లం కొండ శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటివలే పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన ఈ సినిమా ప్రస్తుతం మొదటి షెడ్యుల్ జరుపుకుంటుంది.ఇటివలే ఈ సినిమాలో శ్రీనివాస్ కు హీరోయిన్ గా కాజల్ ను కన్ఫర్మ్ చేసారు మేకర్స్. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని ఇప్పటికే ప్రకటించిన మేకర్స్ లేటెస్ట్ గా ఈ సినిమాలో మరో హీరోయిన్ గా కేథరీన్ ను ఫైనల్ చేసారని సమాచారం.

అయితే కేథరీన్ ఈ సినిమాలో నెగిటీవ్ రోల్ లో కనిపించనుందని తెలుస్తుంది. వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు నవీన్ నిర్మాత. థమన్ సంగీతం అందిస్తున్నాడు.