కళ్యాణ్ రామ్ స్పీడ్ పెంచేసాడు

Sunday,April 01,2018 - 05:00 by Z_CLU

మొన్నటి వరకూ ఏడాదికో సినిమా చేసిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు స్పీడ్ పెంచేసాడు. ఈ మధ్యే ‘MLA’ అంటూ థియేటర్స్ లోకి వచ్చిన ఈ నందమూరి హీరో మే నెలలో ‘నా నువ్వే’ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ రెండూ సినిమాలను  సైమల్టియస్ గా ఫినిష్ చేసిన కళ్యాణ్ రామ్ ప్రస్తుతం మూడు సినిమాలు కన్ఫర్మ్ చేసేశాడు.

ఇప్పటికే కె.వి.గుహన్ డైరెక్షన్ లో ఓ సినిమా అలాగే విరించి వర్మ తో మరో  సినిమా ఫైనల్ చేసుకున్న కళ్యాణ్ రామ్ మరో వైపు ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో పవన్న్ సాదినేని దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తో పాటు ఎన్టీఆర్ అలాగే హరికృష్ణ కూడా నటిస్తారని సమాచారం.

ప్రస్తుతం ఈ మూడు సినిమాలకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే ఈ మూడు సినిమాల్లో కళ్యాణ్ రామ్ ముందుగా ఏ సినిమాను సెట్స్ పైకి తీసుకోస్తాడో..చూడాలి.