రామ్ చరణ్ తో సెన్సేషన్ డైరెక్టర్

Sunday,April 01,2018 - 12:40 by Z_CLU

ప్రస్తుతం ‘రంగస్థలం’ సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ త్వరలోనే బోయపాటి శ్రీను సినిమా సెట్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో ఓ సినిమా అలాగే కొరటాల డైరెక్షన్ లో మరో సినిమా చేయబోతున్నాడు చెర్రీ. ఈ ఇద్దరు డైరెక్టర్స్ తో పాటు అర్జున్ రెడ్డి ఫేం సందీప్ తో కూడా ఓ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే చరణ్ తో చాలా సందర్భాల్లో కనిపించిన సందీప్ లేటెస్ట్ గా రంగస్థలం సక్సెస్ సెలెబ్రేషన్స్ లో పాల్గొనడంతో ఈ కాంబినేషన్ లో సినిమా కన్ఫర్మ్ అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది.

ప్రస్తుతం చెర్రీ కోసం సందీప్ ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని.. వీరిద్దరి మధ్య కథా చర్చలు జోరుగా జరుగుతున్నాయని తెలుస్తుంది. ‘అర్జున్ రెడ్డి’ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ ఆ మధ్య బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తాడనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు సందీప్ ఆ హిందీ సినిమాను పక్కన పెట్టి తెలుగులోనే సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం. మరి ప్రస్తుతం వరుసగా మూడు సినిమాలతో బిజీ గా ఉన్న చరణ్ సందీప్ డైరెక్షన్ లో నటించడానికి టైం పట్టొచ్చు.