బాలయ్య డిసైడ్ అయ్యాడు.. త్వరలోనే అనౌన్స్ మెంట్ !

Sunday,May 27,2018 - 02:11 by Z_CLU

 తండ్రి నందమూరి తారకరామారావు కథతో బాలయ్య  ‘NTR’ బయోపిక్ చేయబోతున్న సంగతి తెలిసిందే..ఈ సినిమాను నిర్మాత సాయి కొర్రపాటితో కలిసి స్వయంగా నిర్మించబోతున్న బాలయ్య మరో సినిమాను కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నాడట. త్వరలో బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాను కూడా తనే సొంతంగా నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాను లాంచనగా ప్రారంభించి స్వయంగా ఈ విషయాన్నీ ప్రకటించనున్నాడట.

ప్రస్తుతం ‘NTR’ సినిమాతో పాటు వినాయక్ డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు బాలయ్య. ఈ రెండు సినిమాలతో పాటు బోయపాటి శ్రీను సినిమాను కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నాడట. ప్రస్తుతం రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న బోయపాటి ఆ సినిమా తర్వాత చేయబోయే సినిమా బాలయ్య దే అని సమాచారం.