నటుడు, నిర్మాత 'మాదాల రంగారావు' కన్నుమూత

Sunday,May 27,2018 - 12:44 by Z_CLU

ప్రముఖ నటుడు , నిర్మాత మాదాల రంగారావు (69)   మృతి చెందారు.  గత కొన్ని రోజులుగా  హైదరబాద్ స్టార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం తెల్లవారు జామున 5 గంటలకు తుది శ్వాస విడిచారు. మొదటి నుండి విప్లవ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఆయన ఆ సినిమాలతో పలు ఘన విజయాలు అందుకున్నారు. ముఖ్యంగా ‘విప్లవ శంఖం’,’యువతరం కదిలింది’,’మహా ప్రస్థానం’,’ఎర్ర మల్లెలు’ వంటి  చిత్రాలతో గుర్తింపు అందుకున్నారు.  ప్రస్తుతం ఆయన  పార్దివ దేహాన్ని ప్రముఖులు, అభిమానుల సందర్శనార్ధం ఫిలిం నగర్ లోని ఆయన స్వగృహమునందు ఉంచారు. మెగా స్టార్ చిరంజీవి , మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు సినీ,   రాజ కీయ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకొని ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.