జీ సినిమాలు ( 28th మే )

Sunday,May 27,2018 - 10:51 by Z_CLU

విక్టరీ

హీరో హీరోయిన్లు  – నితిన్, మమతా మోహన్ దాస్

ఇతర నటీనటులుసింధు తులాని, అశుతోష్ రానా, శశాంక్, దువ్వాసి మోహన్, బ్రహ్మానందం,అలీ

సంగీతంచక్రి

బ్యానర్ఆర్.ఆర్. మూవీ మేకర్స్

దర్శకత్వంరవి. సి. కుమార్

విడుదల – 2008, జూన్ 27

ల్యాండ్ మాఫియా నేపథ్యంలో నితిన్ నటించిన సినిమా విక్టరీ. 2008లో నితిన్ మూడు సినిమాలు చేస్తే అందులో ఒకటి విక్టరీ. అశుతోష్ రానా విలన్ గా నటించిన ఈ సినిమాలో మమతా మోహన్ దాస్ ఎప్పీయరెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓ తెలివైన కుర్రాడు తన బలంతో పాటు తెలివితేటలతో ల్యాండ్ మాఫియాను ఎలా అడ్డుకున్నాడనేదే ఈ సినిమా స్టోరీ.

=============================================================================

సూరిగాడు

నటీనటులు : సురేష్, యమున

ఇతర నటీనటులు : దాసరి నారాయణ రావు, సుజాత, సురేష్, గొల్లపూడి, వేలు, రాళ్ళపల్లి, కాంతారావు, బ్రహ్మానందం, బాబూ మోహన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : వాసూ రావు

డైరెక్టర్ : దాసరి నారాయణ రావు

ప్రొడ్యూసర్ : డి. రామా నాయుడు

రిలీజ్ డేట్:  1992

కష్టపడి పెంచిన తలిదండ్రులను కన్నా బిడ్డలే పట్టించుకోకపోతే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు తెరకెక్కించారు డైరెక్టర్ దాసరి నారాయణరావు. ఈ సినిమాలో తండ్రి పాత్ర కూడా స్వయంగా ఆయనే పోషించారు. ఈ సినిమాలో ‘ఒకే ఒక ఆశ’ అంటూ సాగే పాట సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది.

=============================================================================

అదిరిందయ్యా చంద్రం

హీరో హీరోయిన్లుశివాజీ, లయ

ఇతర నటీనటులుసంగీత, మధుశర్మ, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, ఏవీఎస్

సంగీతంఎం.ఎం.శ్రీలేఖ

స్క్రీన్ ప్లే, దర్శకత్వంశ్రీనివాసరెడ్డి

విడుదల తేదీ – 2005, ఆగస్ట్ 20

బ్యానర్ఎస్పీ క్రియేషన్స్

శివాజీ, లయ కలిసి నటించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అదిరిందయ్యా చంద్రం.  శివాజీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. శివాజీలో అదిరిపోయే కామెడీ టైమింగ్ ఉందని మరోసారి నిరూపించింది ఈ సినిమా.

=============================================================================

చంటి

హీరో  హీరోయిన్లురవితేజ,  చార్మి

ఇతర  నటీనటులు –  డైజీ బోపన్న, అతుల్ కులకర్ణి, రేవతి, రఘుబాబు, సుబ్బరాజు, వేణుమాధవ్

సంగీతంశ్రీ

దర్శకత్వంశోభన్

విడుదల తేదీ – 2004, నవంబర్ 12

హీరో రవితేజ అప్పటికే పూర్తిస్థాయి హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, ఇడియట్, ఖడ్గం, ఇట్లు శ్రావణి  సుబ్రమణ్యం లాంటి హిట్స్ ఉన్నాయి. మరోవైపు శోభన్ వర్షం సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్నాడు. అలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ చంటి. చార్మి హీరోయిన్  గా నటించిన ఈ సినిమాకు శ్రీ సంగీతం అందించాడు. దర్శకుడు  శోభన్ కు ఇదే ఆఖరి చిత్రం. ఈ సినిమా తర్వాత కన్నడంలో మరో సినిమా ఎనౌన్స్ చేసినప్పటికీ… అది సెట్స్ పైకి వెళ్లకముందే తీవ్రమైన గుండెపోటుతో శోభన్ చనిపోయారు. అదే ఏడాది శోభన్ సోదరుడు, ప్రముఖ కమెడియన్ లక్ష్మీపతి కూడా కన్నుమూయడం బాధాకరం.

=============================================================================

ఒంగోలు గిత్త

నటీనటులు : రామ్ పోతినేని, కృతి కర్బందా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కిషోర్ దాస్, ప్రభు, అజయ్, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, రమాప్రభ, రఘుబాబు, సంజయ్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : భాస్కర్

ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్

రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013

రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి, కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

=============================================================================

ముకుంద

నటీనటులు : వరుణ్ తేజ్, పూజ హెగ్డే

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, రావు రమేష్, అభిమన్యు సింగ్, పరుచూరి వెంకటేశ్వర రావు, సత్యదేవ్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్: మిక్కీ. జె. మేయర్

డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల

ప్రొడ్యూసర్: ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్

రిలీజ్ డేట్ : 24 2014

మెగా హీరో వరుణ్ తేజ్ సిల్వర్ స్క్రీన్ పై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సూపర్ హిట్ సినిమా ముకుంద. ఒకే ఊళ్ళో రాజకీయ నేపథ్యంలో జరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమాలో యూత్ కి , అటు ఫ్యామిలీకి సంబంధించిన ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.