జీ సినిమాలు ( 21st మే )

Sunday,May 20,2018 - 11:03 by Z_CLU

నేనేం చిన్నపిల్లనా

నటీనటులు : రాహుల్ రవీంద్రన్, తన్వి వ్యాస్

ఇతర నటీనటులు : సంజనా గల్రాణి, శరత్ బాబు, సుమన్, రఘుబాబు, L.B.శ్రీరామ్, కాశీ విశ్వనాథ్

మ్యూజిక్ డైరెక్టర్ : M.M.శ్రీలేఖ

డైరెక్టర్ : P. సునీల్ కుమార్ రెడ్డి

ప్రొడ్యూసర్ : D. రామానాయుడు

రిలీజ్ డేట్ : 8 నవంబర్ 2013

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన మరో సూపర్ హిట్ ఫిలిం ‘నేనేం చిన్నపిల్లనా..’. నిజానికి దర్శక నిర్మాతలు ఈ సినిమాకి టైటిల్ ‘పట్టుదల’ అని డిసైడ్ అయ్యారు. తీరా సినిమా రిలీజ్ కి దగ్గర పడ్డాక ‘నేనేం చిన్నపిల్లనా’ టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, తన్వి వ్యాస్ హీరో హీరోయిన్ లు గా నటించారు. M.M.శ్రీలేఖ సంగీతం అందించారు.

==============================================================================

సూపర్ పోలీస్

నటీనటులు : వెంకటేష్, నగ్మా, సౌందర్య

ఇతర నటీనటులు : D. రామా నాయుడు, కోట శ్రీనివాస రావు, జయసుధ, బ్రహ్మానందం, ఆలీ, జయసుధ

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహ్మాన్

డైరెక్టర్ : K. మురళి మోహన్ రావు

ప్రొడ్యూసర్ : D. సురేష్

రిలీజ్ డేట్ : 23 జూన్ 1994

ఇన్స్ పెక్టర్ విజయ్ (వెంకటేష్) నిజాయితీ గల పోలీసాఫీసర్. తన గర్ల్ ఫ్రెండ్ ఒక ఆక్సిడెంట్ లో చనిపోతుంది. అప్పటి నుండి తాగుడుకు బానిస అయిన విజయ్ జర్నలిస్ట్ రేణుక ఇంటిలో అద్దెకు దిగుతాడు అంతలో విజయ్ కి అదే సొసైటీలో బిగ్ షాట్ గా చెలామణి అవుతున్న అబ్బాన్న తో వైరం ఏర్పడుతుంది. తనతో తలపడే ప్రాసెస్ తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది ఆక్సిడెంట్  వల్ల కాదు, అది ప్లాన్డ్ మర్డర్ అని తెలుసుకుంటాడు. తనని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది..? తన దగ్గర ఉండిపోయిన సాక్ష్యాలేంటి అనే కోణంలో కథ ముందుకు సాగుతుంది.

==============================================================================

మున్నా

నటీనటులు : ప్రభాస్, ఇలియానా

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, రాహుల్ దేవ్, తనికెళ్ళ భరణి, వేణు మాధవ్, పోసాని కృష్ణ మురళి, వేణు తదితరులు…

మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్

డైరెక్టర్ : వంశీ పైడిపల్లి

ప్రొడ్యూసర్ : దిల్ రాజు

రిలీజ్ డేట్ : 2, మే  2007

ప్రభాస్, ఇలియానా జంటగా నటించిన పర్ ఫెక్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి పీటర్ హెయిన్స్ యాక్షన్, హారిస్ జయరాజ్ సంగీతం హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

ఒక ఊరిలో

నటీనటులు : తరుణ్, రాజా, సలోని

ఇతర నటీనటులు : చంద్ర మోహన్, నరేష్, కల్పన, రామరాజు, యమునా, నిరోషా

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : రమేష్ వర్మ

ప్రొడ్యూసర్ : చంటి అడ్డాల

రిలీజ్ డేట్ : 1 జూలై 2005

లవర్ బాయ్ తరుణ్, తెలుగమ్మాయి సలోని జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ ఒక ఊరిలో. ఒక అందమైన ఊరిలో మొదలైన ప్రేమకథ ఏ మలుపు తిరిగింది. చివరికి ఏమైంది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమా అనిపించుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలెట్.

==============================================================================

లక్ష్మీ రావే మా ఇంటికి

నటీనటులు : నాగశౌర్య, అవికా గోర్

ఇతర నటీనటులు : వెన్నెల కిషోర్, రావు రమేష్, నరేష్, కాశి విశ్వనాథ్, సప్తగిరి, సత్యం రాజేష్, నల్ల వేణు, ప్రగతి, పవిత్ర లోకేష్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రాధాకృష్ణ

డైరెక్టర్ : నంద్యాల రవి

ప్రొడ్యూసర్ : గిరిధర్ మామిడిపల్లి

రిలీజ్ డేట్ : డిసెంబర్ 5, 2014

నాగశౌర్య, అవికా గోర్ జంటగా తెరకెక్కిన అద్భుత ప్రేమ కథా కుటుంబ చిత్రం లక్ష్మీ రావే మా ఇంటికి. నంద్యాల రవి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని థియేటర్ల లోను సూపర్ హిట్ అయింది. రాధాకృష్ణ సంగీతం సినిమాకి హైలెట్.

==============================================================================

గోల్కొండ హై స్కూల్

నటీనటులు : సుమంత్, స్వాతి

ఇతర నటీనటులు : సుబ్బరాజు, తనికెళ్ళ భరణి ,షఫీ ,విద్య సాగర్

మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణి మాలిక్

డైరెక్టర్ : ఇంద్రగంటి మోహన కృష్ణ

ప్రొడ్యూసర్ : రామ్ మోహన్

రిలీజ్ డేట్ : 14  జనవరి 2011

ఓ గ్రౌండ్ దక్కించుకోవాలని ఓ స్కూల్ విద్యార్థులు చేసే ప్రయత్నం ఆధారంగా క్రికెట్ ఆట తో ఆటలు మా హక్కు అనే నినాదం తో  రూపొందిన సినిమా ‘గోల్కొండ హై స్కూల్’. సుమంత్ ను డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపిస్తూ స్కూల్ పిలల్లతో  ఫుల్లెన్త్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఇంద్ర గంటి మోహన కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటూ అలరిస్తుంది. కళ్యాణ్ మాలిక్ పాటలు ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్.