బ్యాక్ టు బ్యాంగ్

Wednesday,December 21,2016 - 02:30 by Z_CLU

సీనియర్స్ సూపర్ ఫాం లో ఉన్నారు. నిన్నా మొన్నటి వరకు జూనియర్ NTR, పవన్ కళ్యాణ్, నాగచైతన్య ఇలా చెపుకుంటూ పోతే మ్యాగ్జిమం యంగ్ హీరోల హవా నడిచింది. కాని సీనియర్స్ స్పీడ్ చూస్తుంటే బ్యాక్ టు బ్యాంగ్ అంటూ బరిలోకి దిగినట్టే అనిపిస్తుంది.

రీసెంట్ గా రిలీజైన మెగాస్టార్ ఖైదీ నం 150 సింగిల్ సాంగ్, గౌతమీపుత్ర శాతకర్ణీ ట్రేలర్ సోషల్ నెట్ వర్క్స్ లో చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. అటు మెగాసాంగ్ ఏకంగా 3 మిలియన్ వ్యూస్ రీచ్ అయితే, బాలయ్య GPS ట్రేలర్ 4 మిలియన్స్ దాటేసింది.

ఇద్దరు సీనియర్ స్టార్స్ కరియర్ కి ఈ రెండూ సినిమాలు చాలా స్పెషల్. మెగాస్టార్ కి ఇది 150 వ సినిమా అయితే, బాలయ్యకి 100 సినిమా. అందుకే ఫ్యాన్స్ కూడా ఈ సినిమాలకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా క్రేజీగా ఫాలో అయిపోతున్నారు.