సినీరాజకీయం: పొలిటికల్ హీరోలొస్తున్నారు

Tuesday,October 09,2018 - 11:02 by Z_CLU

సినిమా….రాజకీయం ఈ రెండిటికి ఉండే క్రేజే వేరు… అందుకే ఈ రెండు రంగాలను కలిపే పొలిటికల్ డ్రామా సినిమాలంటే ఆడియన్స్ బాగా ఇష్టపడుతుంటారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తెలుగులో మాత్రం కాస్త అరుదుగా వస్తుంటాయి.. కానీ ప్రస్తుతం పొలిటికల్ డ్రామా జోనర్ సినిమాలు వరుసపెట్టి థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతున్న ఆ పొలిటికల్ సినిమాలపై ‘జీ సినిమాలు’ ఎక్స్ క్లూజీవ్ స్టోరీ.

‘భరత్ అనే నేను’… మహేష్ – కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో మళ్ళీ పొలిటికల్ జోనర్ ల హవా పెంచింది.. భారీ అంచనాల నడుమ థియేటర్స్ లోకొచ్చిన ఈ సినిమా మహేష్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కోసం యంగ్ చీఫ్ మినిస్టర్ అవతారమెత్తిన మహేష్ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో మెస్మరైజ్ చేసాడు. ఈ సినిమాతో మహేష్ ని పొలిటీషియన్ గా మార్చేసిన కొరటాల తన దైన సన్నివేశాలతో అదరగోట్టేసాడు. ఎప్పటి నుండో పొలిటికల్ జోనర్ లో ఓ సినిమా చేయాలనుకుంటున్న మహేష్ కోరికను తీర్చేసిన సినిమా ‘భరత్ అనే నేను’.


మహేష్ తర్వాత సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కూడా పొలిటీషియన్ అవతారమెత్తాడు. ప్రెజెంట్ థియేటర్స్ లో సందడి చేస్తున్న ‘నోటా’ తమిళ్, తెలుగు బైలింగ్వల్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే… ఈ సినిమాలో ముఖ్య మంత్రి పాత్రలో కనిపించి తన పవర్ ఫుల్ యాక్టింగ్ తో ఎంటర్టైన్ చేసాడు విజయ్.. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో యువత రాజకీయాల్లోకి వస్తే సమాజంలో ఎలాంటి మార్పు వస్తుందనేది చూపించాడు దర్శకుడు ఆనంద్ శంకర్.

 

‘భరత్ అనే నేను’.. ‘నోటా’ తర్వాత ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వరుసగా పొలిటికల్ సినిమా లోస్తున్నాయి. అందులో ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఒకటి.. నందమూరి తారకరామారావు కథతో పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2 గా వస్తున్న ఈ సినిమాలో అప్పటి రాజకీయ పరిస్థుతలను కళ్ళకుకట్టినట్టుగా చూపించనున్నారు. బాలయ్య తారకరామారావు గా నటిస్తున్న ఈ సినిమాలో రానా చంద్ర బాబు నాయుడు పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం అటు నందమూరి అభిమానులతో పాటు సినిమా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 24న ఈ సినిమా థియేటర్స్ లోకి రానుంది.

దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితంలో జరిగిన ఓ యథార్థ సంఘటనతో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుంది యాత్ర. మమ్ముట్టీ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయకముందు రాజశేఖర్ రెడ్డి చేసిన యాత్ర అనే సెగ్మెంట్ ను తీసుకొని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 70 mmఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్, శశి నిర్మిస్తున్న ఈ సినిమాకు మహి వి.రాఘవ్ దర్శకుడు.


1996 లో కమల్ హాసన్ -శంకర్ కాంబినేషన్ లో వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘భారతీయుడు’ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రెడీ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేసిన శంకర్ కమల్ కి హాసన్ నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. ప్రస్తుతం 2.0 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీ గా ఉన్న శంకర్ త్వరలోనే ఈ పొలిటికల్ డ్రామాను సెట్స్ పై పెట్టబోతున్నాడు. తమిళ్, తెలుగు బైలింగ్వల్ గా రూపొందనున్న ఈ సినిమాతో కమల్ మళ్ళీ ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో…చూడాలి.


ఇప్పటికే కొన్ని పొలిటికల్ డ్రామా సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన శ్రీకాంత్ మరో పొలిటికల్ యాక్షన్ డ్రామాతో రెడీ అవుతున్నాడు. శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ పొలిటికల్ మూవీ ‘ఆపరేషన్ 2019’బివేర్‌ ఆఫ్‌ పబ్లిక్‌… అనేది ఉపశీర్షిక. కారణం బాబ్జీ డైరెక్షన్ లో పక్కా పొలిటికల్ డ్రామా గా రూపొందుతున్న ఈ సినిమాలో మంచు మనోజ్, సునీల్ గెస్ట్ రోల్స్ లో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.